EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china4fc9c95b-5744-4c67-9566-61b9b1bb209e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china4fc9c95b-5744-4c67-9566-61b9b1bb209e-415x250-IndiaHerald.jpgభారత్, చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రఫెల్ యుద్ధ విమానాలతో పాటు, మిగతా విమానాలను కూడా సరిహద్దుల్లో సిద్ధం చేసి ఉంచింది భారత్. చైనా తైవాన్ పై యుద్ధం ప్రకటిస్తుందా.. లేక ఇండియాతో పోట్లాటకు సిద్ధపడుతుందా అనేది డైలామాలో ఉన్నా.. భారత్ మాత్రం అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చలికాలం వెళ్లిపోయి ఎండాకాలం ప్రారంభమైన దశలో అక్కడున్నటువంటి మంచు కరిగిపోయి గాల్వాన్ లోయలో పాంగ్వాన్ సరస్సు పారే అవకాశం ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని చైనా ఏమైనా చేయొచ్చు. మీడియం రCHINA{#}war;Indiaచైనా సరిహద్దుల్లో బ్రహ్మాస్త్రాలు మోహరించిన భారత్?చైనా సరిహద్దుల్లో బ్రహ్మాస్త్రాలు మోహరించిన భారత్?CHINA{#}war;IndiaThu, 02 Mar 2023 05:00:00 GMTభారత్, చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రఫెల్ యుద్ధ విమానాలతో పాటు, మిగతా విమానాలను కూడా సరిహద్దుల్లో సిద్ధం చేసి ఉంచింది భారత్. చైనా తైవాన్ పై యుద్ధం ప్రకటిస్తుందా.. లేక ఇండియాతో పోట్లాటకు సిద్ధపడుతుందా అనేది డైలామాలో ఉన్నా.. భారత్ మాత్రం అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చలికాలం వెళ్లిపోయి ఎండాకాలం ప్రారంభమైన దశలో అక్కడున్నటువంటి మంచు కరిగిపోయి గాల్వాన్ లోయలో పాంగ్వాన్ సరస్సు పారే అవకాశం ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని చైనా ఏమైనా చేయొచ్చు.


మీడియం రేంజ్ సర్పేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ను భారత్ అక్కడ మొహరిస్తుంది. లాజిస్టిక్ లో ఇది అత్యంత కీలకమైనది. బాలిస్టిక్ మిస్సైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎటాక్ ఎలికాప్టర్స్, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్, సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ని కేవలం 30 సెకన్లలో కూల్చి వేయగల సామర్థ్యం ఉన్న ఎయిర్ మిస్సైల్స్ ను భారత్ అక్కడ మొహరించింది.


200 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న మిస్సైల్స్ ను ముందుగానే పసిగట్టి వాటిని గాల్లోనే ధ్వంసం చేయగల ఎస్300 టాలెంట్ ఉన్నటువంటి క్షిపణులను భారత్ చైనా సరిహద్దుల్లోకి చేర్చి రెడీగా ఉంది. ఇప్పుడు భారత్ ఆయా ప్రాంతాల్లో యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో చైనా కాస్త కలవరానికి గురైనట్లు తెలుస్తోంది.


గతంలో చాలా మంది సైనికులను గాల్వాన్ లోయలో ఇప్పటికే భారత్ కోల్పోయింది. మరోసారి డ్రాగన్ కంట్రీ కుటిల ప్రయత్నాలు చేస్తే వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వ సన్నద్ధంగా ఉంది.  చైనా భారత్ తో యుద్ధం గనక చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధరంగంలోకి దిగితే అది ఎంత ప్రమాదకరమో ఊహించలేం. రాబోయే రోజుల్లో చైనా, భారత్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : పగోళ్ళు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరప్పా

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>