Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-study5bfa2b17-f179-4f93-9eca-7b6d5243e787-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-study5bfa2b17-f179-4f93-9eca-7b6d5243e787-415x250-IndiaHerald.jpgజీవితం అనేది ఎంతో విలువైనది.. నవ మాసాలు మోసిన తల్లి జన్మనిచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇక ప్రయోజకులను చేయాలి అని ఉద్దేశంతో తాహతకు మించి పెద్దపెద్ద స్కూల్లు కాలేజీలలో చదివిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అల్లారుముద్దుగా పెరిగిన తమ పిల్లలు ప్రయోజకులు అయి తమకు మంచి పేరు తీసుకువస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది యువకులు ఏకంగా చిన్నచిన్న కారణాలకే మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లలే ప్రాణంగా బతుకుతున్న తల్లిదండ్రుల ప్రాణం తీసేసినంత పని చేస; study{#}Naga Chaitanya;students;Sucide;Parents;Josh;Athadu;collegeస్టూడెంట్ సాత్విక్ సూసైడ్.. నాగచైతన్య స్పీచ్ వైరల్?స్టూడెంట్ సాత్విక్ సూసైడ్.. నాగచైతన్య స్పీచ్ వైరల్?; study{#}Naga Chaitanya;students;Sucide;Parents;Josh;Athadu;collegeThu, 02 Mar 2023 08:48:36 GMTజీవితం అనేది ఎంతో విలువైనది.. నవ మాసాలు మోసిన తల్లి జన్మనిచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇక ప్రయోజకులను చేయాలి అని ఉద్దేశంతో తాహతకు మించి పెద్దపెద్ద స్కూల్లు కాలేజీలలో చదివిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అల్లారుముద్దుగా పెరిగిన తమ పిల్లలు ప్రయోజకులు అయి తమకు మంచి పేరు తీసుకువస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది యువకులు ఏకంగా చిన్నచిన్న కారణాలకే మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లలే ప్రాణంగా బతుకుతున్న తల్లిదండ్రుల ప్రాణం తీసేసినంత పని చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత తమ పిల్లలు చెడు దారిలో వెళ్తున్నారని తల్లిదండ్రులకు అనిపిస్తే వారిని మళ్లీ సన్మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులు కొన్ని కొన్ని సార్లు కసురుకోవడం.. చదువుకోవాలి అంటూ బలవంత పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తమకు దగ్గరగా ఉంటే పిల్లలు గారాభం చేస్తారని మనసులో కొండంత బాధను దాచుకుని హాస్టల్లో జాయిన్ చేస్తారు. కానీ ఇక తల్లిదండ్రులకు దూరంగా చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్న ఎంతోమంది చదువును పక్కన పెట్టేస్తున్నారు. మరి కొంతమంది కళాశాలలో చదువుకోమని చేస్తున్న ఒత్తిడి భరించలేక  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



 ఇటీవల సాత్విక్ అనే విద్యార్థి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఎన్నో ఆశలతో కాలేజీలో జాయిన్ అయ్యాడు. అయితే ఇక బట్టి పట్టి చదవాలంటూ కాలేజీ యాజమాన్యం అతని ఎంతలా హింసించిందో అతడు రాసిన సూసైడ్ నోట్ కళ్లకి కట్టినట్లు చూపించింది   చివరికి బాధలు భరించలేనంటూ బ్రతుకు చాలించాడు. కాగా ఇలా చదువుల ఒత్తిడి భరించలేక మానసికంగా కృంగిపోతున్న సాత్విక్ లాంటి విద్యార్థులు ఎంతోమంది సాత్విక్ మృతి తర్వాత నాగచైతన్య స్పీచ్ వైరల్ గా మారింది. జోష్ సినిమాలో డిస్కో అనే మీటింగ్లో విద్యార్థులు చదువు ఒత్తిడి గురించి ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు.  చదువు ఒకటే జీవితమ.. చదువు లేకపోతే వాడు దేనికి పనికిరాడ.. విద్యార్థికి అసలు ఏం నేర్పిస్తున్నారు.. సగటున ఒక రోజుకి 16 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ జోష్ సినిమాలో చైతు చెప్పిన స్పీచ్ ఇక ఇప్పుడు నేటి తరం విద్యార్థులకు బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

హాలీవుడ్ హీరోతో పోల్చిన యాంకర్.. చరణ్ ఏమన్నాడంటే?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>