EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war4fe1bc33-0e46-404b-a5d9-bfcf9f9fbd14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war4fe1bc33-0e46-404b-a5d9-bfcf9f9fbd14-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో దాదాపు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను కోల్పోయింది. డొనెట్స్క్, జెపొజజరియా, లూహన్ స్కీ, కేర్సన్, లాంటి ప్రాంతాలను ఇప్పటికే రష్యాకు కోల్పోయింది. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. 2014 లో రష్యా ఆక్రమించిన క్రిమియాను మళ్లీ ఉక్రెయిన్ లో కలిపేందుకు సైనిక చర్య చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని చాలా భూభాగాలను ఆక్రమించుకుంది. ఆయా ప్రాంతాల్లో జెలెన్ స్కీ పట్టు కోల్పోతున్నారు. వాటినే కాపాడుకోవడంలో వUKRAIN WAR{#}Vietnam;Ukraine;war;Russia;American Samoaఉక్రెయిన్‌, రష్యా పోరులో ఆ ప్రాంతమే కీలకం?ఉక్రెయిన్‌, రష్యా పోరులో ఆ ప్రాంతమే కీలకం?UKRAIN WAR{#}Vietnam;Ukraine;war;Russia;American SamoaThu, 02 Mar 2023 10:00:00 GMTరష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో దాదాపు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను కోల్పోయింది. డొనెట్స్క్, జెపొజజరియా, లూహన్ స్కీ, కేర్సన్, లాంటి ప్రాంతాలను ఇప్పటికే రష్యాకు కోల్పోయింది. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. 2014 లో రష్యా ఆక్రమించిన క్రిమియాను మళ్లీ ఉక్రెయిన్ లో కలిపేందుకు సైనిక చర్య చేపడుతున్నట్లు చెప్పారు.


ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని చాలా భూభాగాలను ఆక్రమించుకుంది. ఆయా ప్రాంతాల్లో జెలెన్ స్కీ పట్టు కోల్పోతున్నారు. వాటినే కాపాడుకోవడంలో విఫలమవుతున్నా ఆయన క్రిమియాను తిరిగి పొందుతామని చెప్పడం హస్యాస్పదంగా కనిపిస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. క్రిమియా జోలికి వస్తే నా జోలికి వచ్చినట్లేనని ఇప్పటికే హెచ్చరించారు. ఒక వేళ క్రిమియా గురించి కనక జెలెన్ స్కీ పోరాటం చేయాలనుకుంటే ఇప్పటివరకు ఆయనకు మద్దతు ఇచ్చిన 30 దేశాలు ఇప్పుడు పట్టించుకోవు.


యూరప్ దేశాలు ఆయుధాలు, ఆర్థికపరంగా సాయం చేస్తున్నందు వల్లనే ఇప్పటి వరకు యుద్ధం కొనసాగుతుంది. యుద్ధ వ్యుహాలు రచించడంలో జెలెన్ స్కీ పొరపాటు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఎక్కడైనా దాడులు చేయాలనుకుంటే వాటిని బహిరంగంగా ఎవరూ చెప్పరు. కానీ జెలెన్ స్కీ మాత్రం మేము అక్కడ యుద్ధం చేయాలనుకుంటున్నాం అని బయటకు మాట్లాడే సరికి ప్రత్యర్థి ఒక్కసారిగా అలర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది.


సరైన యుద్ధ వ్యుహాలను అనుసరిస్తే తాలిబాన్లు ఆఫ్గాన్ లో ఉన్న అమెరికా సైన్యాన్ని తరిమేసినట్లు, వియత్నాం లాంటి చిన్న దేశం అమెరికాను ఎదురొట్టి నిలిచినట్లు చేయొచ్చు. 30 దేశాలు ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయమని వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్న ఉక్రెయిన్ వల్ల కావడం లేదు. దీనికి ఆ దేశ అధ్యక్షుడు అవలంబిస్తున్న కారణాలే అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి క్రిమియా జోలికి పోతే పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆయా దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" షూటింగ్ అంత శాతం పూర్తి..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>