MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/visweksenc698818c-6868-4898-8a32-8ca3444cbf10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/visweksenc698818c-6868-4898-8a32-8ca3444cbf10-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో విశ్వక్ సేన్ కు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఎటువంటి పోలికా కనిపించదు. దక్షిణాది సినిమా రంగంలో మోహన్ లాల్ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటే విశ్వక్ సేన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా పూర్తిగా సెటిల్ కాని యంగ్ హీరో. అతడు నటించిన సినిమాలు కొన్ని మాత్రమే అయినప్పటికీ అతడి నటనలో అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ లో ఉన్న ప్రత్యేకత వల్ల నేటితరం ప్రేక్షకులకు అతడు బాగా కనెక్ట్ అయ్యాడు.ఈ హీరోను నమ్ముకుని సీనియర్ హీరో అర్జున్ తన సొంత బ్యానర్ పై తానే దర్శకుడుగా మారి తvisweksen{#}Mohanlal;Athadu;Viswak sen;Rajani kanth;Heroine;Hero;Arjun;Cinemaవిశ్వ‌క్ సేన్‌ లోటును తీరుస్తున్న మోహన్ లాల్ !విశ్వ‌క్ సేన్‌ లోటును తీరుస్తున్న మోహన్ లాల్ !visweksen{#}Mohanlal;Athadu;Viswak sen;Rajani kanth;Heroine;Hero;Arjun;CinemaWed, 01 Mar 2023 09:00:00 GMTయంగ్ హీరో విశ్వక్ సేన్ కు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఎటువంటి పోలికా కనిపించదు. దక్షిణాది సినిమా రంగంలో మోహన్ లాల్ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటే విశ్వక్ సేన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా పూర్తిగా సెటిల్ కాని యంగ్ హీరో. అతడు నటించిన సినిమాలు కొన్ని మాత్రమే అయినప్పటికీ అతడి నటనలో అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ లో ఉన్న ప్రత్యేకత వల్ల నేటితరం ప్రేక్షకులకు అతడు బాగా కనెక్ట్ అయ్యాడు.

 

 ఈ హీరోను నమ్ముకుని సీనియర్ హీరో అర్జున్ తన సొంత బ్యానర్ పై తానే దర్శకుడుగా మారి తన కూతురు ను హీరోయిన్ చేసి ఆమధ్య ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఆసినిమా ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా కూడ జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమూవీ ప్రాజెక్ట్ నుండి విశ్వక్ సేన్ తప్పుకోవడంతో రంగంలోకి దిగిన అర్జున్ విశ్వక్ సేన్ పై ఘాటైన విమర్శలు చేసాడు.

 

 
దీనితో ఈమూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అంతా భావించారు. అయితే ఇప్పుడు మళ్ళీ అర్జున్ పట్టుపట్టి ఆమూవీని తిరిగి ప్రారంభించడం కాకుండా ఆమూవీ ప్రాజెక్ట్ లో విశ్వక్ సేన్ స్థానంలో మోహన్ లాల్ ను ఎంపిక చేయడం సంచలనంగా మారింది. వాస్తవానికి మోహన్ లాల్ ఎంచుకునే కథలు చాల డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటిది ఒక యంగ్ హీరో వదులుకున్న కథకు టాప్ హీరో మోహన్ లాల్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

 

 
మంచి నటుడుగా పేరున్న మోహన్ లాల్ తనకు కథ నచ్చితే చాలు చిన్న బడ్జెట్ మూవీ భారీ బడ్జెట్ మూవీ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. దీనికితోడు అర్జున్ కు మోహన్ లాల్ కు ఉన్న సాన్నిహిత్యం వల్ల కూడ ఈమూవీ ప్రాజెక్ట్ తిరిగి పట్టాలు ఎక్కింది అనుకోవాలి. దీనితో విశ్వక్ సేన్ వదులుకున్న కథలో అంతమంచి పాయింట్ ఉండటమే కాకుండా మోహన్ లాల్ ను ప్రభావితం చేసే స్థాయిలో ఉందా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు..

 



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా.. హీరోయిన్ లయ ఏం చెప్పిందంటే?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>