EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/britana6df761b-8305-47aa-87c3-03317394f2c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/britana6df761b-8305-47aa-87c3-03317394f2c5-415x250-IndiaHerald.jpgరవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన దేశం బ్రిటన్. ప్రపంచాన్ని ఒంటి చేత్తో పాలించిన వైనం.. రాజరికపు భోగాలు, ఒకటేమిటి ఐశ్వర్యానికి కొదవ లేని దేశం బ్రిటన్. ఇదంతా ఒకప్పటి మాట గతమెంతో ఘనం.. ప్రస్తుతం అధ్వానం అన్నట్లు తయారైంది బ్రిటన్ కథ. ఆంగ్ల దేశంలో తిండి కోసం దాతలు ఇచ్చే దాని కోసం క్యూలైన్లలో కోటులు వేసుకుని మరీ నిలబడుతున్నారంటే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్రిటన్ లో పెను సంక్షోభం మొదలైంది. ప్రపంచంలో 23 శాతం భూ భాగాన్ని తమ ఆదిపత్యంలో పెట్టుకున్న దేశం ప్రసbritan{#}Europe countries;Parentsఅయ్యో.. బ్రిటన్‌ పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?అయ్యో.. బ్రిటన్‌ పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?britan{#}Europe countries;ParentsWed, 01 Mar 2023 11:00:00 GMTరవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన దేశం బ్రిటన్. ప్రపంచాన్ని ఒంటి చేత్తో పాలించిన వైనం.. రాజరికపు భోగాలు, ఒకటేమిటి ఐశ్వర్యానికి కొదవ లేని దేశం బ్రిటన్. ఇదంతా ఒకప్పటి మాట గతమెంతో ఘనం.. ప్రస్తుతం అధ్వానం అన్నట్లు తయారైంది బ్రిటన్ కథ. ఆంగ్ల దేశంలో తిండి కోసం దాతలు ఇచ్చే దాని కోసం క్యూలైన్లలో కోటులు వేసుకుని మరీ నిలబడుతున్నారంటే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారో చెప్పుకోవచ్చు.


ప్రస్తుతం బ్రిటన్ లో పెను సంక్షోభం మొదలైంది. ప్రపంచంలో  23 శాతం భూ భాగాన్ని తమ ఆదిపత్యంలో పెట్టుకున్న దేశం ప్రస్తుతం తిండి గింజలకు ఇబ్బందులు పడుతోంది. 1913 లో 412 మిలియన్ల ప్రజలను పాలించిన దేశం బ్రిటన్. కానీ ఇప్పుడు బ్రిటన్ లో ప్రూట్స్, వెజిటెబుల్స్ రేషన్ మీద ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. షాపుల్లో ఖాళీ షెల్ప్స్ కనిపిస్తున్నాయి. టామోటా, కుకుంబర్ లాంటివి మూడు యూనిట్లకు మించి కొనకూడదని చెబుతున్నారు.


యూరప్ లో తీవ్రమైన మంచు ప్రభావం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని ప్రతిదీ అచితూచి కొనుక్కోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాస్ట్ ఆప్ లివింగ్ పెరిగిపోయింది. మూడు నెలలుగా బ్యాంకులు అన్నదానం లాంటి కార్యక్రమం చేపడుతున్నాయి. వీరు కూడా ఇంకా రెండు నెలల కంటే ఎక్కువ పెట్టలేని పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.


అనేక చోట్ల పిల్లల తల్లిదండ్రులు స్కూల్స్ ని మానేపిస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. అనేక చోట్ల మూడు పూటలకు బదులు ఒక పూట తింటున్నారని తెలుస్తోంది. సేవింగ్స్ అన్ని ఖర్చయిపోయాయి. 1956 తర్వాత ఆ స్థాయికి దిగజారిపోవడం ఇదే మొదటి సారి. ఒక్కొక్కరు ఒక్కో కారులో తిరిగే స్థాయి నుంచి నలుగురు కలిసి ఒక కారులో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. బ్రిటన్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, సమ్మెలు కొనసాగుతున్నాయి. మరి రారాజులా బతికి అన్ని దేశాలను పాలించినా తెల్ల జాతీయుల పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందంటే విధిరాత తప్పదేమో అనిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>