Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna4caec5d3-6cab-46fd-ab6c-1066064f1cdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna4caec5d3-6cab-46fd-ab6c-1066064f1cdf-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడాలని చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ది ఘోస్ట్ సినిమా ఘోరంగా పోయింది. అందుకే ఆ సినిమా రిజల్ట్ తో షాక్ అయిన నాగ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ తో తన తదుపరి సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమా ని సైలెంట్ గా మొదలు పెట్టారని టాక్.Nagarjuna{#}Akkineni Nagarjuna;editor mohan;prasanna;Bigboss;God Father;Makar Sakranti;Cinemaనాగార్జున అంతా సీక్రెట్ గా చేస్తున్నారా..!నాగార్జున అంతా సీక్రెట్ గా చేస్తున్నారా..!Nagarjuna{#}Akkineni Nagarjuna;editor mohan;prasanna;Bigboss;God Father;Makar Sakranti;CinemaWed, 01 Mar 2023 23:35:00 GMTకింగ్ నాగార్జున సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడాలని చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ది ఘోస్ట్ సినిమా ఘోరంగా పోయింది. అందుకే ఆ సినిమా రిజల్ట్ తో షాక్ అయిన నాగ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ తో తన తదుపరి సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమా ని సైలెంట్ గా మొదలు పెట్టారని టాక్. సంక్రాంతి టైం లోనే ఆ సినిమా పండుగ కి సంబంధించిన ప్రభలను.. ఆ కల్చర్ ని చూపించేలా షూట్ చేశారని టాక్. అయితే ఉగాది సందర్భంగా సినిమాను డైరెక్ట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్తారని అంటున్నారు.

మరి నాగార్జున సినిమా అంత సీక్రెట్ గా ఎందుకు లాంచ్ చేశారన్నది అర్ధం కావట్లేదు. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా చేయాలని చెబుతున్నారట నాగ్. అయితే ఈమధ్య కాలంలో సినిమా టైటిల్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తే తప్ప సినిమా మీద హైప్ రావట్లేదు. అలాంటిది ఇలా సైలెంట్ గా చేస్తే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. ఘోస్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా కు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇచ్చుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

మరి నాగ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కి కూడా ఆయన నో చెప్పినట్టు టాక్. సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయాలని దాదాపు పదుల సంఖ్యల్లో కథలు వింటున్నట్టు తెలుస్తుంది. ఇదే కాదు నాగ్ 100వ సినిమాని కూడా ప్లానింగ్ లో ఉన్నారు. గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో నాగార్జున 100వ సినిమా చేస్తారని టాక్.





RRR Telugu Movie Review Rating

నాగార్జున అంతా సీక్రెట్ గా చేస్తున్నారా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>