MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyca31a189-f311-40cd-81ec-5dc6f65aa9ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyca31a189-f311-40cd-81ec-5dc6f65aa9ae-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో రోజురోజుకీ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సగటు మనిషి జీవితం చాలా కష్టంగా మారుతుంది. చాలామంది ప్రజలు తమ ఇంటి బడ్జెట్ ను నిర్వహించుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లతో కూడిన సమయాలలో భవిష్యత్తు గురించి ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ఆందోళన చెందడం సహజం. అయితే అదృష్టవశాత్తు ద్రవ్యాల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే ఎన్నో పరిష్కారాలు మన వద్ద ఉన్నాయి. ముఖ్యంగా మీరు చిన్న పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో కోటీశ్MONEY{#}sampada;January;central governmentమనీ: రూ.5000 ఆదాతో కోటి రూపాయలు అందించే స్కీమ్..!మనీ: రూ.5000 ఆదాతో కోటి రూపాయలు అందించే స్కీమ్..!MONEY{#}sampada;January;central governmentWed, 01 Mar 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో రోజురోజుకీ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సగటు మనిషి జీవితం చాలా కష్టంగా మారుతుంది. చాలామంది ప్రజలు తమ ఇంటి బడ్జెట్ ను నిర్వహించుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లతో కూడిన సమయాలలో భవిష్యత్తు గురించి ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ఆందోళన చెందడం సహజం. అయితే అదృష్టవశాత్తు ద్రవ్యాల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే ఎన్నో పరిష్కారాలు మన వద్ద ఉన్నాయి.

ముఖ్యంగా మీరు చిన్న పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో కోటీశ్వరులు కూడా అవ్వచ్చు. అలాంటి పథకాలలో బెస్ట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టం. కేంద్ర ప్రభుత్వం దీనిని 2004 జనవరి 1న ప్రారంభించింది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అని చెప్పిన ఆ తర్వాత మాత్రం ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకునే వెసలు బాటును కల్పించడం జరిగింది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు కూడా పొందుతారు. పదవి విరమణ పొందేసరికి పెద్ద మొత్తంలో మీరు స్థిర ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ పథకంలో 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు ఎవరైనా సరే కావటం తెరవచ్చు. కనీసం రూ.500 పెట్టుబడితో ఖాతాను ప్రారంభించవచ్చు.. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పదవీ విరమణ తర్వాత జీవితానికి భద్రత ఇవ్వడమే. మీకు 30 సంవత్సరాలు అయితే 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తారు.  మీరు ఇప్పటినుంచే ప్రతి నెల రూ. 5000 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీరు పదవి విరమణ చేసేసరికి కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు పొందవచ్చు.  పెట్టిన పెట్టబడిపై కనీస రాబడి 10% అంచనా వేసిన నికర పెన్షన్ సంపద రూ.1.11 కోట్లు లభిస్తుంది. అంటే మీరు 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి నెలకు రూ.27,996 పెన్షన్ రూపంలో పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>