MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-dasara49efe4e5-37c9-43d9-abec-a218ef2371c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-dasara49efe4e5-37c9-43d9-abec-a218ef2371c8-415x250-IndiaHerald.jpgమార్చి నెల నుండి మే చివరి వరకు కొనసాగే మూడు నెలల సమయం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో కీలకం. సమ్మర్ రేస్ గా పరిగణింపబడే ఈమూడు నెలల సమయంలో భారీ సినిమాలు విడుదల అవ్వడం ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గత సంవత్సరం సమ్మర్ కు ‘కేజీ ఎఫ్ 2’ ‘సర్కారు వారి పాట’ ‘ఆచార్య’ లాంటి భారీ సినిమాలు విడుదల అయితే మధ్యలో విడుదలైన ‘సీతారామం’ ఎవరూ ఊహించని అత్యంత భారీ విజయాన్ని అందుకుంది.ఈసారి సమ్మర్ రేస్ కు చిరంజీవి పవన్ మహేష్ జూనియర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ ల సినిమాలు ఏమీ పూర్తికాక పోవడంతో వారంతాNANI DASARA{#}Winner;Chiranjeevi;keerthi suresh;Mass;Arjun;Nani;Jr NTR;Ram Charan Teja;Industry;Cinema;Heroine;Tollywoodదసరా కు కలసివస్తున్న కాలం !దసరా కు కలసివస్తున్న కాలం !NANI DASARA{#}Winner;Chiranjeevi;keerthi suresh;Mass;Arjun;Nani;Jr NTR;Ram Charan Teja;Industry;Cinema;Heroine;TollywoodWed, 01 Mar 2023 12:16:40 GMTమార్చి నెల నుండి మే చివరి వరకు కొనసాగే మూడు నెలల సమయం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో కీలకం. సమ్మర్ రేస్ గా పరిగణింపబడే ఈమూడు నెలల సమయంలో భారీ సినిమాలు విడుదల అవ్వడం ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గత సంవత్సరం సమ్మర్ కు ‘కేజీ ఎఫ్ 2’ ‘సర్కారు వారి పాట’ ‘ఆచార్య’ లాంటి భారీ సినిమాలు విడుదల అయితే మధ్యలో విడుదలైన ‘సీతారామం’ ఎవరూ ఊహించని అత్యంత భారీ విజయాన్ని అందుకుంది.


ఈసారి సమ్మర్ రేస్ కు చిరంజీవి పవన్ మహేష్ జూనియర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ ల సినిమాలు ఏమీ పూర్తికాక పోవడంతో వారంతా సమ్మర్ రేస్ కు దూరంగా ఉన్నారు. ఈసారి సమ్మర్ కు విడుదల అవుతున్న సినిమాలలో ఎక్కువ మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ‘దసరా’ ‘శాకుంతలం’ మూవీల పై అంచనాలు ఉన్నప్పటికీ ‘దసరా’ మాస్ సినిమా కావడంతో ఈసారి సమ్మర్ రేస్ విజేత నాని అయితే తీరుతాడని ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.


దీనికి తగ్గట్టుగానే ‘దసరా’ మూవీ ట్రైలర్ తో పాటు ఆమూవేలోని పాటలు కూడ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఈమూవీ గ్యారెంటీ సమ్మర్ రేస్ విజేత అన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈమూవీ బిజినెస్ కూడ 80 కోట్ల స్థాయిలో జరగడంతో నాని కెరియర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా ‘దసరా’ మారితీరుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.


ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ ఈమూవీ విడుదల అయిన తరువాత మాత్రమే తాను కొత్త సినిమాలకు ఓకె చేసి ఎగ్రిమెంట్ పై సంతకాలు పెడతాను అని చెపుతోంది అంటూ వస్తున్న వార్తలను బట్టి నానీకి అదేవిధంగా కీర్తి సురేష్ కు ఈమూవీ పై ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది..  






RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>