MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirancbaf1591-5b90-4af3-bc9f-090dd8767a37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirancbaf1591-5b90-4af3-bc9f-090dd8767a37-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. సెబాస్టియన్ ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచాయి. అలా పోయిన సంవత్సరం మూడు మూవీ లలో ఒక మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకkiran{#}kiran;vishnu;Posters;Hero;Tollywood;Telugu;Cinemaకిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!kiran{#}kiran;vishnu;Posters;Hero;Tollywood;Telugu;CinemaWed, 01 Mar 2023 18:51:53 GMTఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. సెబాస్టియన్ ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచాయి.

అలా పోయిన సంవత్సరం మూడు మూవీ లలో ఒక మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ఒక విజయవంతమైన సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

రమేష్ కడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని ఈ సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కిరణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో జీప్ లో కూర్చొని ఉన్నాడు. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>