MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntreaa912d3-567a-4ea4-8973-87cc069f4855-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntreaa912d3-567a-4ea4-8973-87cc069f4855-415x250-IndiaHerald.jpg‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన దగ్గర నుండి చరణ్ జూనియర్ అభిమానుల మధ్య కానరాని చిచ్చు కొనసాగుతూనే ఉంది. ఆమూవీలో చరణ్ అల్లూరి పాత్రకు లభించినంత ప్రాధాన్యత జూనియర్ కొమరం భీమ్ పాత్రకు లభించక పోవడంతో తారక్ అభిమానులు మొదటి నుండి జూనియర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’లో అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.అయితే సున్నితమైన ఈవిషయాన్ని పసిగట్టిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ ల పాత్రలను చూడాలి కానీ ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అన్న అభిప్రాయంలో ఉండవద్దు అంటూ జక్కన్న స్వయంగా అవకాశం చిక్JUNIOR NTR{#}Alluri Sitarama Raju;Komaram Bheem;Event;Jr NTR;Raccha;media;vedhika;Oscar;Rajamouli;Hollywoodచరణ్ జూనియర్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన ఫారిన్ అవార్డులు !చరణ్ జూనియర్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన ఫారిన్ అవార్డులు !JUNIOR NTR{#}Alluri Sitarama Raju;Komaram Bheem;Event;Jr NTR;Raccha;media;vedhika;Oscar;Rajamouli;HollywoodWed, 01 Mar 2023 08:00:00 GMT‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన దగ్గర నుండి చరణ్ జూనియర్ అభిమానుల మధ్య కానరాని చిచ్చు కొనసాగుతూనే ఉంది. ఆమూవీలో చరణ్ అల్లూరి పాత్రకు లభించినంత ప్రాధాన్యత జూనియర్ కొమరం భీమ్ పాత్రకు లభించక పోవడంతో తారక్ అభిమానులు మొదటి నుండి జూనియర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’లో అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.


అయితే సున్నితమైన ఈవిషయాన్ని పసిగట్టిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ ల పాత్రలను చూడాలి కానీ ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అన్న అభిప్రాయంలో ఉండవద్దు అంటూ జక్కన్న స్వయంగా అవకాశం చిక్కినప్పుడల్లా చరణ్ జూనియర్ అభిమానులకు సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. దీనికి తగ్గట్టుగా చరణ్ జూనియర్ లు మీడియా ముందు కలిసి హడావిడి చేస్తూ తమకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని తమ పాత్రల విషయంలో ఎటువంటి అసంతృప్తి లేదు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే వచ్చారు.


ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికాలోని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు అవార్డులు ఇవ్వడంతో పాటు ఆ అవార్డుల వేదిక పై చరణ్ కనిపించి జూనియర్ కనిపించకపోవడంతో తారక్ అభిమానులు చాల అసహనానికి లోనై అనేక నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈవిషయాన్ని గ్రహించిన రాజమౌళి చరణ్ తో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో తెలివిగా రంగంలోకి దిగి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వాహకులతో ఒక ప్రకటన చేయించాడు.


తాము జూనియర్ ను కూడ పిలిచామని అయితే తారక్ కుటుంబానికి చెందిన తారకరత్న చనిపోవడంతో జూనియర్ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల ఈవెంట్ కు రాలేదు అంటూ క్లారిటీ వచ్చినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ అవార్డుల విషయంలో తారక్ కు అన్యాయం జరిగింది అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని తెలియ చేస్తున్నారు. వాస్తవానికి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ లాంటి సంస్థలు అమెరికాలో అనేకం ఉన్నాయి. అలాంటి సంస్థలు ఇచ్చే అవార్డులు ఆస్కార్ అవార్డులు లా పరిగణించి అనవసరంగా తారక్ జూనియర్ అభిమానులు అనవసరపు రచ్చ క్రియేట్ చేస్తున్నారు అంటూ మరికొందరి అభిప్రాయం..







RRR Telugu Movie Review Rating

కోడిపిల్ల కోస్టార్ అయితే.. కీర్తి సురేష్ ఎవరు..?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>