Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika649ed29b-62c8-4b82-b8d2-ff4b0c53e9c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika649ed29b-62c8-4b82-b8d2-ff4b0c53e9c9-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న వారిలో రాధిక కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో హీరోయిన్గా రాధిక ఎంతలా హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో రాధిక అయితే బాగుంటుంది అనేంతలా తన నటన ప్రతిభతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక తెలుగు భాషలో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడ స్టార్ హీరోయిన్గRadhika{#}radhika;Alitho saradaga;Jr NTR;NTR;Tamil;Tollywood;Heroine;Hero;Teluguస్టార్ హీరో మీద ప్రేమతో.. తన మనవడికి అదే పేరు పెట్టిన రాధిక?స్టార్ హీరో మీద ప్రేమతో.. తన మనవడికి అదే పేరు పెట్టిన రాధిక?Radhika{#}radhika;Alitho saradaga;Jr NTR;NTR;Tamil;Tollywood;Heroine;Hero;TeluguWed, 01 Mar 2023 09:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న వారిలో రాధిక కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో హీరోయిన్గా రాధిక ఎంతలా హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో రాధిక అయితే బాగుంటుంది అనేంతలా తన నటన ప్రతిభతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక తెలుగు భాషలో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడ స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది అన్న విషయం తెలిసిందే.


 ఇలా ఒకప్పుడు హీరోయిన్గా హవా నడిపించిన రాధిక.. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అంతే బిజీగా కొనసాగుతూ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పాలి. అయితే గతంలో ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న రాధిక తనకు టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరు అన్న విషయాన్ని వెల్లడించింది. ఇక నేటి జనరేషన్లో ఎన్టీఆర్ అంటే తనకు పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన రాధిక ఇటీవల ఏకంగా తన అభిమాన హీరో మీద ఎంత అభిమానం ఉంది అన్న విషయాన్ని చాటుకుంది అని చెప్పాలి.



 ఏకంగా రాధిక తన మనవడికి తారక్ అనే పేరు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది అని చెప్పాలి. అదే సమయంలో మీరు మీ ఇష్టమైన హీరోని ఎన్నిసార్లు కలిశారు అంటూ ప్రశ్నించగా.. తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్టీఆర్ను కలవలేదని.. ఇక తనకు ఎప్పటికైనా ఎన్టీఆర్ ను కలిసి ఒక్క సినిమాలో అయినా ఆయనతో నటించాలని కోరిక ఉంది అంటూ మనసులో మాట చెప్పేసింది రాధిక. తారక్ నటన అద్భుతంగా ఉంటుందని ఆయనను తెరపై చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతాను అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఏకంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలా ఎన్టీఆర్ మీద అభిమానంతో తన మనవడికి తారక్ అనే పేరు పెట్టడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>