Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chory39fd914f-8ede-4fb7-aab8-3aa34a14ab68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chory39fd914f-8ede-4fb7-aab8-3aa34a14ab68-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో దొంగతనాల ట్రెండు పూర్తిగా మారిపోయింది. దొంగతనాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది.. రాత్రి సమయంలో ఇక తాళాలు పగలగొట్టి దొంగ ఇంట్లోకి వెళ్లడం ఇక విలువైన వస్తువులను దోచుకెల్లడం లాంటివి జరుగుతూ ఉండేది. సినిమాల్లో చూపించిన నిజ జీవితంలో జరిగిన దొంగలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఇదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం దొంగతనం చేసే తీరు పూర్తిగా మారిపోయింది. ప్రజల వీక్ పాయింట్లనే తమ క్యాష్ పాయింట్గా మార్చుకుంటున్న ఎంతోమంది ఎరవేసి మరి గాలం వేస్తూ ఉన్నారు. చివరికి ఇక దొంగతనాలకు కొత్త కొతChory{#}temple;Drugs;Ranga Reddy;Reddy;Mahbubnagar;Shadnagar;gold;Thief;Traffic police;Donga;marriage;policeఈ దొంగ మామూలోడు కాదు.. ప్రేమగా పూరి తినిపిస్తాడు.. తర్వాత?ఈ దొంగ మామూలోడు కాదు.. ప్రేమగా పూరి తినిపిస్తాడు.. తర్వాత?Chory{#}temple;Drugs;Ranga Reddy;Reddy;Mahbubnagar;Shadnagar;gold;Thief;Traffic police;Donga;marriage;policeTue, 28 Feb 2023 09:15:00 GMTఇటీవల కాలంలో దొంగతనాల ట్రెండు పూర్తిగా మారిపోయింది.  దొంగతనాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది.. రాత్రి సమయంలో ఇక తాళాలు పగలగొట్టి దొంగ ఇంట్లోకి వెళ్లడం ఇక విలువైన వస్తువులను దోచుకెల్లడం లాంటివి జరుగుతూ ఉండేది. సినిమాల్లో చూపించిన నిజ జీవితంలో జరిగిన దొంగలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఇదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం దొంగతనం చేసే తీరు పూర్తిగా మారిపోయింది. ప్రజల వీక్ పాయింట్లనే తమ క్యాష్ పాయింట్గా మార్చుకుంటున్న ఎంతోమంది ఎరవేసి మరి గాలం వేస్తూ ఉన్నారు. చివరికి ఇక దొంగతనాలకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇటీవల మహబూబ్నగర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఏడు తులాల బంగారం చోరీ అయింది. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే పూరీలో మత్తుమందు కలిపి ఇక మెడలో ఉన్న గొలుసులను ఎత్తుకుపోయారు. పెళ్లి సంబంధాల పేరుతో పరిచయం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత ఎంతో ప్రేమగా మాట్లాడి టిఫిన్ చేయిస్తారు. ఇక పూరీలో నిద్రమత్తు టాబ్లెట్స్ ఇచ్చి చోరీకి పాల్పడతారు. తేరుకున్నాక బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇదే తీరుతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అని చెప్పాలి. పెళ్లి సంబంధాల కోసం ముహూర్తం కోసం వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ ఇక గడియలు బాగా లేవని షాద్నగర్ పరిధిలోని రామేశ్వరం గుడి వద్దకు పిలిచి.. ఇక అక్కడ తినే పూరీలలో మత్తుమందు టాబ్లెట్స్ ఇచ్చి ఇక వాళ్ళు నిద్రలోకి జారుకున్నాక.. మెడలో ఉన్న బంగారు గొలుసులు దొంగలిస్తున్నాడు ఆ దొంగ.  ఓ బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరిని అతని పట్టుకున్నారు. అతను మహబూబ్నగర్ జిల్లా బీకే రెడ్డి కాలనీకి చెందిన పెరుమాళ్ళ నరహరిగా గుర్తించారు పోలీసులు.



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీ లీల.. అదే కారణమా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>