MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashouryaeda6db34-3079-48db-91ca-45ec9aba78f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashouryaeda6db34-3079-48db-91ca-45ec9aba78f5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య.. లవ్ స్టోరీస్ తో పాటు విభిన్నమైన కథలతో ఉండే సినిమాలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న నాగశౌర్య ప్రస్తుతం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'నారి నారి నడుమ మురారి', 'పోలీస్ వారి హెచ్చరిక' వంటి వరుస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఈ హీరో నటించిన 'కృష్ణ క్రింద విహారి' సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని కమర్షియల్ హిట్Nagashourya{#}naga shourya;prema;Oohalu Gusagusalade;NagaShaurya;Love;Hyderabad;marriage;Hero;media;Cinemaనడిరోడ్డుపై లవర్స్ తో గొడవకు దిగిన హీరో నాగశౌర్య.. వీడియో వైరల్..!!నడిరోడ్డుపై లవర్స్ తో గొడవకు దిగిన హీరో నాగశౌర్య.. వీడియో వైరల్..!!Nagashourya{#}naga shourya;prema;Oohalu Gusagusalade;NagaShaurya;Love;Hyderabad;marriage;Hero;media;CinemaTue, 28 Feb 2023 14:58:24 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య.. లవ్ స్టోరీస్ తో పాటు విభిన్నమైన కథలతో ఉండే సినిమాలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న నాగశౌర్య ప్రస్తుతం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'నారి నారి నడుమ మురారి', 'పోలీస్ వారి హెచ్చరిక' వంటి వరుస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఈ హీరో నటించిన 'కృష్ణ క్రింద విహారి' సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే నాగశౌర్య పెళ్లి చేసుకున్నాడు. 

అయితే తాజాగా నాగశౌర్య ఈరోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ప్రేమ జంట పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న నాగశౌర్య చూసి వెంటనే దిగి వాడి దగ్గరకు వచ్చి.. 'ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్? అని అడిగాడు. అతను.. 'తను నా లవర్, నా ఇష్టం. నీకెందుకు..' అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు నాగశౌర్య అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అని గొడవకు దిగాడు. 

అలా ఆ అబ్బాయితో నాగశౌర్య గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే నాగశౌర్య ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అసలు అక్కడ జరిగిన గొడవ ఏంటి? అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియదు. సాధారణంగా నాగ శౌర్య తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విషయంలో కొత్త ఐడియాస్ తో ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వీడియో కూడా తన సినిమా పబ్లిసిటీ కోసం అయి ఉంటుందేమో అని నేటిజన్స్ అనుకుంటున్నారు. కానీ తాజాగా తేలిన విషయం ఏంటంటే అది పబ్లిసిటీ కాదు. అది నిజంగా జరిగిన గొడవే. ఓ అమ్మాయిని నడిరోడ్డుపై కొట్టిన అబ్బాయిని నిజాయితీగా నాగశౌర్య నిలదీయడంతో.. నాగశౌర్య వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు...!!
" style="height: 788px;">




RRR Telugu Movie Review Rating

నడిరోడ్డుపై లవర్స్ తో గొడవకు దిగిన హీరో నాగశౌర్య.. వీడియో వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>