Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketde43ddc3-3970-4e73-8d7b-497195641a79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketde43ddc3-3970-4e73-8d7b-497195641a79-415x250-IndiaHerald.jpgప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో ఇన్నింగ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ తన అద్భుతమైన స్పిన్ తో మాయాజాలం చేశాడు. ఏకంగా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టును కష్టాల్లో పడేశాడు అని చెప్పాలి. కివీస్ కి శుభారంభం ఇచ్చిన డేవాన్ కాన్వెను పంపి తొలి వికెట్ అందుకున్న జాక్ లీచ్ ఓపెనింగ్ జోడిని విడగొటCricket{#}England;New Zealand;twitter;Tom Banton;Tom Hooperఇంగ్లాండ్ బౌలర్ దెబ్బకి.. బిత్తరపోయిన కివీస్ బెటర్?ఇంగ్లాండ్ బౌలర్ దెబ్బకి.. బిత్తరపోయిన కివీస్ బెటర్?Cricket{#}England;New Zealand;twitter;Tom Banton;Tom HooperMon, 27 Feb 2023 08:50:00 GMTప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో ఇన్నింగ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ తన అద్భుతమైన స్పిన్ తో మాయాజాలం చేశాడు. ఏకంగా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టును కష్టాల్లో పడేశాడు అని చెప్పాలి. కివీస్ కి శుభారంభం ఇచ్చిన డేవాన్ కాన్వెను పంపి తొలి వికెట్ అందుకున్న జాక్ లీచ్ ఓపెనింగ్ జోడిని విడగొట్టాడు అని చెప్పాలి.



 అయితే ఇక మంచి ప్రదర్శన చేస్తూ ఇంగ్లాండుకు ప్రమాదకరంగా మారిపోతున్న టామ్ లాథం ను సైతం జోరూట్ ఎల్ బి డబ్ల్యూ చేశాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ తమ మెరుగైన బౌలింగ్ తో ఏకంగా న్యూజిలాండ్ ఓపెనర్లను అవుట్ చేయడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత విల్ యంగ్ రూపంలో జాక్ లీచ్ కి రెండో వికెట్ కూడా దక్కింది అని చెప్పాలి. ఇకపోతే విల్ యంగ్ ను జాక్ లీచ్ తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేసిన తీరు మాత్రం ఇన్నింగ్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.



 62 ఓవర్ లో ఇక ఇలా తన స్పిన్ మాయాజాలం చూపించాడు జాక్ లీచ్. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు.  అయితే బంతిని అంచనా వేయలేకపోయాడు న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్. ముందుకు రావాలో లేదంటే క్రీజులో ఉండి డిఫెన్స్ చేయాలో అతనికి అర్థం కాలేదు. అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టి బ్యాట్ తో డిఫెన్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అంతలోపే బంతి అద్భుతమైన స్పిన్ తీసుకొని ఆఫ్ సైడ్ స్టంపును ఎగరగొట్టడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే బౌల్డ్ అయిన తర్వాత విల్ యంగ్ ఒక్కసారిగా అవ్వక్కయ్యాడు. ఇది ఎలా సాధ్యమైందో అతనికి అర్థం కాలేదు. ఇక 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిరాశగా అతను పెవిలియన్ చేరాడు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

ఎయిర్పోర్టులో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏంటా అని చెక్ చేస్తే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>