Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanb982ba77-f8a6-444f-9659-2040ed867027-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanb982ba77-f8a6-444f-9659-2040ed867027-415x250-IndiaHerald.jpg60 ఏళ్లు దాటిపోతున్న సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంకా తనలో కసి తగ్గలేదు అన్నట్లుగా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. యువ హీరోలకు మించి బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అదే సమయంలో వరుసగా సూపర్ హిట్ లు కూడా సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. గత ఏడాది గాడ్ ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టిన మెగాస్టార్ ఇక ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సాధించాడు అని చెప్పాలి. బాబీ దర్శకత్వంలో వచ్Pawan kalyan{#}keerthi suresh;meher ramesh;tamannaah bhatia;Yuva;Tammudu;Bobby;God Father;Thammudu;kalyan;Chiranjeevi;Remake;trivikram srinivas;Telugu;Tamil;Cinemaఓకే డేట్ కోసం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ?ఓకే డేట్ కోసం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ?Pawan kalyan{#}keerthi suresh;meher ramesh;tamannaah bhatia;Yuva;Tammudu;Bobby;God Father;Thammudu;kalyan;Chiranjeevi;Remake;trivikram srinivas;Telugu;Tamil;CinemaMon, 27 Feb 2023 08:40:00 GMT60 ఏళ్లు దాటిపోతున్న సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంకా తనలో కసి తగ్గలేదు అన్నట్లుగా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. యువ హీరోలకు మించి  బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అదే సమయంలో వరుసగా సూపర్ హిట్ లు కూడా సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  గత ఏడాది గాడ్ ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టిన మెగాస్టార్ ఇక ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సాధించాడు అని చెప్పాలి. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.


 ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. తమిళ సూపర్ హిట్ మూవీ అయిన వేదాలంకు ఈ సినిమా తెలుగు రీమేక్ కావడం గమనార్హం. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటించింది. అదే సమయంలో జాతీయ అవార్డు గ్రహీత అయిన కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా సందడి చేయబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా  జరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఓ సినిమా స్టార్ట్ అయింది.


 తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతం సినిమాకు ఇది తెలుగు రీమేక్ కావడం గమనార్హం. దీనికి సముద్రకిని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు అని చెప్పాలి. అయితే ఈ రెండు రీమేక్ చిత్రాలను కూడా అటు ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఆగస్టు 11వ తేదీన విడుదల చేస్తే వీకెండ్ తో పాటు   ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి కలిసి వస్తుందని భావిస్తున్నారట. దీంతో ఎంతో సులభంగా బ్రేక్ ఈవెన్ దాటేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. అయితే ఇలా మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే తేదీ కోసం పోటీ పడుతూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక విడుదల తేదీ వచ్చేసరికి మాత్రం ఎవరో ఒకరు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. మరీ అలా తగ్గేది ఎవరో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఎయిర్పోర్టులో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏంటా అని చెక్ చేస్తే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>