HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/processed-food7fed2c99-7cc7-42ff-bbd8-3d3bad7dda65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/processed-food7fed2c99-7cc7-42ff-bbd8-3d3bad7dda65-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిని తీసుకుంటే, ప్రమాదం బారిన పడే అవకాశం చాలా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా అంత మాత్రమే కాదు ముసలితనం కూడా చాలా త్వరగా వస్తుందని ఇంకా క్యాన్సర్ సహా పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా పెద్ద ఎత్తున స్టోర్ చేసి ఉంచేందుకు రసాయనాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా హార్మోన్లను ప్రభావితం చేస్తూ ఉంటాయి.ముఖ్యంగా కూల్ డ్రింకులుPROCESSED FOOD{#}Ice cream;Cancerప్రాసెస్ చేసిన ఫుడ్ తింటే కలిగే నష్టాలు?ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటే కలిగే నష్టాలు?PROCESSED FOOD{#}Ice cream;CancerMon, 27 Feb 2023 21:44:10 GMTఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిని తీసుకుంటే, ప్రమాదం బారిన పడే అవకాశం చాలా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా అంత మాత్రమే కాదు ముసలితనం కూడా చాలా త్వరగా వస్తుందని ఇంకా క్యాన్సర్ సహా పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా పెద్ద ఎత్తున స్టోర్ చేసి ఉంచేందుకు రసాయనాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా హార్మోన్లను ప్రభావితం చేస్తూ ఉంటాయి.ముఖ్యంగా కూల్ డ్రింకులు, ప్యాక్ చేసిన చిరుతిళ్లు ఇంకా అలాగే పలు రకాల స్నాక్స్, చీజ్, ప్రాసెస్డ్ క్రీం, బటర్ వంటివి తీసుకోవడం ద్వారా జబ్బుల బారిన పడే అవకాశం చాలా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఖచ్చితంగా కొలొరెక్టల్ (కడుపులో) క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మీరు ప్యాక్డ్ లేదా ప్రాసెస్ చేసిన నాన్-వెజ్, బేకన్, సాసేజ్ ఇంకా అలాగే హాట్ డాగ్ మొదలైనవి తినడం వల్ల క్యాన్సర్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా నాన్ వెజ్ పదార్థాలను స్టోర్ ఉంచేందుకు రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు ప్రతిరోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే, ఖచ్చితంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% పెరుగుతుంది.


ఇక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.అలాగే దీనిని క్రోన్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలిటిస్ అని కూడా అంటారు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఉదాహరణకు, బ్రెడ్, పీనట్ బటర్, కేక్ మిక్స్‌లు, సలాడ్ డ్రెస్సింగ్‌లు, సాస్‌లు, పెరుగు, పుడ్డింగ్, ప్రాసెస్ చేసిన చీజ్, ఐస్ క్రీం ఇంకా అలాగే డెజర్ట్‌లు మొదలైన ప్రాసెస్ ఫుడ్స్ అదే పనిగా తింటే ఖచ్చితంగా ఈ ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే కృత్రిమ చక్కెర ఖచ్చితంగా ఊబకాయం సమస్యను పెంచుతుంది. కొన్నిసార్లు వీటి వినియోగం  దీర్ఘకాలిక వ్యాధులను కూడా తెచ్చిపెడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెరను ఎక్కువగా వాడతారు . కార్న్ సిరప్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ ఇంకా అలాగే మాల్టోస్ లాంటి ఇతర చక్కెరలను కూడా ఉండవచ్చు. రోజువారీ ఆహారంలో 10 శాతానికి మించిన చక్కెరలు తీసుకోవడం శరీరానికి చాలా హానికరం.



RRR Telugu Movie Review Rating

థైస్ ,ఎద అందాలు చూపిస్తూ శృతిమించిన రష్మిక మందన్న ......!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>