EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/media9c75099a-2412-4a8c-a39b-b8859a2ede4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/media9c75099a-2412-4a8c-a39b-b8859a2ede4f-415x250-IndiaHerald.jpgజర్నలిజాన్ని ఎలా కావాలంటే అలా మలిచే రోజులు ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నాయి. కావాల్సిన వారికి డప్పు కొట్టే వార్తలు రాస్తున్న కాలం దాపురించింది. మనకు నచ్చిన కులం వార్తలు రాసే నైజాం ఆంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఎక్కువగా కేటాయించారు. దీన్ని ఆంధ్రలో కొన్ని మీడియా సంస్థలు కవర్ చేయడంలో వెనకబడ్డాయి. బీసీలకు ఎక్కువ కేటాయించిన వార్తల కంటే కాపు, కమ్మ సామాజిక వర్గానికి తక్కువ ఇచ్చాయనే వార్తలు ఎక్కువగా కవర్ చేశాయి. ఇదేమిటంటే బీసీలపై చిన్న చూపు.. మరో వర్గానిపై ఎక్కువ ప్రేMEDIA{#}anil music;ramana;Kamma;Vaddera;prema;Love;News;media;MLA;gannavaram;YCP;Jagan;Kanna Lakshminarayanaఏపీలో జర్నలిజం.. కులాన్ని బట్టే వార్తలా?ఏపీలో జర్నలిజం.. కులాన్ని బట్టే వార్తలా?MEDIA{#}anil music;ramana;Kamma;Vaddera;prema;Love;News;media;MLA;gannavaram;YCP;Jagan;Kanna LakshminarayanaSun, 26 Feb 2023 00:00:00 GMTజర్నలిజాన్ని ఎలా కావాలంటే అలా మలిచే రోజులు ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నాయి. కావాల్సిన వారికి డప్పు కొట్టే వార్తలు రాస్తున్న కాలం దాపురించింది. మనకు నచ్చిన కులం వార్తలు రాసే నైజాం ఆంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఎక్కువగా కేటాయించారు. దీన్ని ఆంధ్రలో కొన్ని మీడియా సంస్థలు కవర్ చేయడంలో వెనకబడ్డాయి. బీసీలకు ఎక్కువ కేటాయించిన వార్తల కంటే కాపు, కమ్మ సామాజిక వర్గానికి తక్కువ ఇచ్చాయనే వార్తలు ఎక్కువగా కవర్ చేశాయి. ఇదేమిటంటే బీసీలపై చిన్న చూపు.. మరో వర్గానిపై ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కొన్ని ఘటనలు జరిగాయి. అందులో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు ఎక్కువగా కవర్ చేశాయి. అచ్చం అలాంటి ఘటన బోడ అనిల్ కార్యాలయంపై జరిగింది. ఈ దాడి ఘటనను చిన్న మూలన ఎక్కడో రాశాయి. ఇక్కడే తెలిసిపోతుంది జర్నలిజంలో ఎలాంటి బేధాలు చూపిస్తున్నారో.. ఎవరి వార్తల్ని హైలైట్ చేసి రాస్తున్నారో.. అలాంటప్పుడు జర్నలిజం విలువ ఎలా పెరుగుతుంది.


జయ మంగళ వెంకట రమణ టీడీపీలో చాలా సంవత్సరాల పాటు కార్యకర్తగా, జడ్పీటీసీగా, ఒక సారి ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయనకు కాకుండా కామినేనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో వైసీపీ ఆయనను పార్టీలో చేర్చుకుంది. ఇలా ఎళ్ల తరబడి పార్టీకి సేవలందించిన వ్యక్తులకు కూడా ఆదరణ చూపించడం లేదు. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే చిన్న వార్తలుగా ఇస్తారు. ఎందుకంటే ఆయన వడ్డెర కులస్తుడు కాబట్టి.


అదే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలో చేరుతున్నారంటే మూడు, నాలుగు రోజులుగా ఒకటే కవరేజీ, ప్రధాన సంచికలో పెద్ద పెద్ద వార్తలు రాస్తున్నారు. అయితే జర్నలిజంలో కులాన్ని, మతాన్ని బట్టి వార్తలు రాసే రోజులు పోవాలి. జర్నలిజం విలువలు కాపాడే విధంగా పత్రికలు, మీడియా కృషి చేయాలి.



RRR Telugu Movie Review Rating

థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ దీవి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>