HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-tips-for-good-health-and-long-life-6c772639-a275-4ae8-aee1-cf134dac47dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-tips-for-good-health-and-long-life-6c772639-a275-4ae8-aee1-cf134dac47dc-415x250-IndiaHerald.jpgమన లివర్ దెబ్బతినడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్ సేవించడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్ ఇంకా అలాగే కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కలుషిత ఆహారాన్ని తీసుకోవడం ఇంకా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల వల్ల కాలేయం చాలా దెబ్బతింటుంది. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కొన్ని రకాల లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను మనం ముందుగానే గుర్తించి అందుకు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కాలేయ ఆరోగ్యాన్ని ఈజీగాLIVER{#}Turmeric;Cholesterol;Manamఈ లక్షణాలుంటే లివర్ ప్రాబ్లెమ్స్ ఖాయం?ఈ లక్షణాలుంటే లివర్ ప్రాబ్లెమ్స్ ఖాయం?LIVER{#}Turmeric;Cholesterol;ManamSun, 26 Feb 2023 19:11:44 GMTమన లివర్ దెబ్బతినడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్ సేవించడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్ ఇంకా అలాగే కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కలుషిత ఆహారాన్ని తీసుకోవడం ఇంకా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల వల్ల కాలేయం చాలా దెబ్బతింటుంది. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కొన్ని రకాల లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను మనం ముందుగానే గుర్తించి అందుకు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కాలేయ ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తగానే ముందుగా జీర్ణవ్యవస్థ అనేది మందగిస్తుంది.ముఖ్యంగా తిన్న ఆహారం జీర్ణమవ్వకపోవడం, నీరు తాగినా జీర్ణమవ్వకపోవడం, ఆకలి లేకపోవడం ఇంకా అలాగే జీర్ణ సమస్యలు దీర్ఘకాలం పాటు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.ఇంకా అలాగే కాలేయ సమస్యలు ఉన్నప్పుడు చర్మం రంగు కూడా మారుతుంది. చర్మం తన రంగును క్రమంగా కోల్పోతుంది. చర్మంపై తెల్లమచ్చలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఇంకా అలాగే కాలేయ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం ముదురు పసుపు పచ్చ రంగులో కూడా ఉంటుంది.


అలాగే మూత్రం తరచూ ఇదే రంగులో వస్తూ ఉంటే జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇంకా అలాగే కళ్లు, గోర్లు పసుపు పచ్చగా మారినప్పుడు కూడా మనం కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే ఎప్పుడూ నోరు చేదుగా ఉన్నా కూడా కాలేయ సమస్యలు ఉన్నాయని గ్రహించాలి. అలాగే కాలేయ సమస్యలు ఉండడం వల్ల నీరసం, త్వరగా అలసిపోవడం వంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి.ఇక కాలేయ సంబంధిత సమస్యలు ఉండడం వల్ల మనం చాలా త్వరగా బరువు పెరుగుతాము. ఇంకా మన నోటి నుండి ఎల్లప్పుడు దుర్వాసన వస్తుంది. కాళ్ల వాపులు కూడా ఎక్కువగా వస్తాయి. చర్మ సమస్యలు, అలర్జీ ఇంకా దురదల బారిన పడాల్సి వస్తుంది.అంతేగాక చెమటలు ఎక్కువగా వస్తాయి. ఇంకా నరాలు ఉబ్బినట్టు కనబడతాయి. అంతేకాకుండా కడుపులో నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది. మనలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి కాలేయ సంబంధిత పరీక్షలని చేయించుకోవాలి. ఈ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే వాటికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మనం ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ : క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>