Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli86d83d36-84cc-4f9b-850a-88ce9657167d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli86d83d36-84cc-4f9b-850a-88ce9657167d-415x250-IndiaHerald.jpgఇటీవల ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన.. సమయంలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఇటీవలే అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో ఎంతో మంది విశ్లేషకులు, అభిమానులు కూడా తనను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్రవేశారని... అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా తన గురించి తనకు తెలుసు కాబట్టి అవేవీ పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో తనకు సహచర క్రికెటర్లు ఎవ్వరూ మద్దతుగా నిలువ లేనKohli{#}VIRAT KOHLI;Smart phone;MS Dhoniఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయని ధోని.. నాకు మెసేజ్ చేశాడు : కోహ్లీఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయని ధోని.. నాకు మెసేజ్ చేశాడు : కోహ్లీKohli{#}VIRAT KOHLI;Smart phone;MS DhoniSun, 26 Feb 2023 16:30:00 GMTఇటీవల ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన.. సమయంలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఇటీవలే అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో ఎంతో మంది విశ్లేషకులు, అభిమానులు కూడా తనను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్రవేశారని... అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా తన గురించి తనకు తెలుసు కాబట్టి అవేవీ పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.



 అయితే గతంలో తనకు సహచర క్రికెటర్లు ఎవ్వరూ మద్దతుగా నిలువ లేని సమయంలో మహేంద్రసింగ్ ధోని మాత్రం తనకు మద్దతుగా నిలిచాడని.. పర్సనల్గా మెసేజ్ చేశాడు అంటూ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ.. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలోనే అతని ప్రోత్సాహంతో ఇక స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. అంతేకాదు ధోని దగ్గర నుంచి ఎన్నో కెప్టెన్సీ నైపుణ్యాలను నేర్చుకొని ఇక ధోని తర్వాత టీమిండియా కు సారధ్య బాధ్యతలు చేపట్టాడు అని చెప్పాలి. ఇక ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు ఏమో అన్న విధంగా కలిసిమెలిసి ఉండేవారు.


 అయితే ఇక ఇటీవలే మరోసారి క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేంద్ర సేమ్ ధోని గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఫామ్ కోల్పోయి క్లిష్ట సమయంలో నేను ఉన్నప్పుడు ధోని ఒక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అండగా నిలబడ్డాడు. సాధారణంగా నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే 99% ధోని ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఫోన్ వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడు. అలాంటి వ్యక్తి స్వయంగా నాకు మెసేజ్ చేశారు. విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ధోని చేసిన మెసేజ్ నా మనసుకు తాకింది. కెప్టెన్సీ వదులుకున్న సమయంలో ఇలా ధోని నుంచి మెసేజ్ వచ్చింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

నీ స్నేహం సినిమాలో.. ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>