MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3a0492cb-e2af-428e-840d-7ee9e1f616da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3a0492cb-e2af-428e-840d-7ee9e1f616da-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది యువతీ యువకులు ఇంటి వద్దనే ఉంటూ డబ్బు బాగా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఒకవైపు డబ్బు సంపాదించాలని ఆలోచిస్తే.. మరొకవైపు తాము ఆకర్షణీయంగా కనిపించాలని బ్యూటీ పార్లర్లకు వెళ్తూ.. అంతకుమించి ఖర్చు చేస్తున్నారు. పెళ్లిళ్లు సీజన్లు వస్తే చాలు ఈ బ్యూటీ పార్లర్లకు ఎక్కడలేని డిమాండ్ పుట్టుకొస్తుంది. అందుకే ఇప్పుడు వీధికి ఒక పార్లర్ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి మీరు పెద్దగా చదువుకోకపోయినా సరే బ్యూటీషియన్ కోర్స్ చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. ఇకపోతే బ్యూటీషియన్ కోMONEY{#}SBI;HEALTH;BEAUTY;Corporate;Telanganaమనీ: రూ.11 వేలతో రూ.లక్షలు పైగా ఆదాయం..!మనీ: రూ.11 వేలతో రూ.లక్షలు పైగా ఆదాయం..!MONEY{#}SBI;HEALTH;BEAUTY;Corporate;TelanganaSat, 25 Feb 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది యువతీ యువకులు ఇంటి వద్దనే ఉంటూ డబ్బు బాగా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఒకవైపు డబ్బు సంపాదించాలని ఆలోచిస్తే.. మరొకవైపు తాము ఆకర్షణీయంగా కనిపించాలని బ్యూటీ పార్లర్లకు వెళ్తూ.. అంతకుమించి ఖర్చు చేస్తున్నారు. పెళ్లిళ్లు సీజన్లు వస్తే చాలు ఈ బ్యూటీ పార్లర్లకు ఎక్కడలేని డిమాండ్ పుట్టుకొస్తుంది. అందుకే ఇప్పుడు వీధికి ఒక పార్లర్ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి మీరు పెద్దగా చదువుకోకపోయినా సరే బ్యూటీషియన్ కోర్స్ చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.

ఇకపోతే బ్యూటీషియన్ కోర్స్ అలాగే బ్యూటీ పార్లర్ స్థాపించడానికి ఎంత పెట్టుబడి కావాలి? ఎలాంటి లాభాలు వస్తాయి? అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెట్విన్ సంస్థ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఉన్న యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.. ముఖ్యంగా ఈ కోర్సు చేయడం వల్ల యువతులు సొంతంగా ఈ బ్యూటీ పార్లర్ స్థాపించి ఇతరులపై ఆధారపడకుండా డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా బ్యూటీ పార్లర్ కార్పొరేట్ సంస్థల్లో కూడా జాయిన్ అయ్యి అలా కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఇకపోతే ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్లకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఏ సందర్భం వచ్చినా సరే వీటికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు.  అలాగే కాస్మటిక్ వ్యాపారం కూడా ప్రతి సంవత్సరం పెరిగిపోతూ వస్తోంది . దీనిని వ్యాపారంగా మార్చుకున్న చాలా మంది లక్షాధికారులు అవుతున్నారు.  కాబట్టి మీరు కేవలం 11 వేల రూపాయలు ఖర్చుపెట్టి బ్యూటిషన్ కోర్స్ నేర్చుకున్నట్లయితే తద్వారా బిజినెస్ మొదలుపెట్టి లక్షల్లో లాభం పొందవచ్చు. సెట్విన్ సంస్థ అధికారిక వెబ్సైట్లో వన్ ఇయర్ డిప్లమా ఇన్ బ్యూటీషియన్ కోర్సును అందిస్తున్నారు.

ఇందులో భాగంగా మొదటి సెమిస్టర్ మూడు నెలల పాటు బేసిక్  బ్యూటీషియన్ కోర్సు , రెండో సెమిస్టర్ లో మూడు నెలలపాటు అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్సు,  మూడో సెమిస్టర్ లో అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ , హెయిర్ డ్రెస్సింగ్ కోర్సులు అందించనున్నారు. నాలుగవ సెమిస్టర్ లో  హెల్త్ కేర్ అండ్ ఎస్బిఐ కోర్సును అందించబోతున్నారు. అయితే వీటన్నిటికి కేవలం రూ. 11, 000 మాత్రమే ఖర్చవుతుంది.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>