MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4f33006c-8b16-4f8a-9190-cd128b7b9ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4f33006c-8b16-4f8a-9190-cd128b7b9ee3-415x250-IndiaHerald.jpgపక్కింటి అబ్బాయి ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని వరసగా 6 సక్సస్ లు అందుకోవడంతో అతడు చాల త్వరగా టాప్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు అని చాలామంది భావించారు. అయితే అతడి ఇమేజ్ మిడిల్ రేంజ్ హీరో స్థాయిని దాటలేకపోతోంది. ఇలాంటి పరిస్థితులలో హీరోల మధ్య పెరిగిపోయిన పోటీ వాతావరణంలో నిలబడి మాస్ హీరోగా తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చు కోవడానికి నాని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసాడు.ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా నాని లేటెస్ట్ గా నటిస్తున్న ‘దసరా’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమnani{#}Athadu;Mass;Tollywood;Nani;Telugu;Hero;News;India;Cinemaపరిస్థితులతో రాజీపడిపోయిన నాని !పరిస్థితులతో రాజీపడిపోయిన నాని !nani{#}Athadu;Mass;Tollywood;Nani;Telugu;Hero;News;India;CinemaSat, 25 Feb 2023 08:00:00 GMTపక్కింటి అబ్బాయి ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని వరసగా 6 సక్సస్ లు అందుకోవడంతో అతడు చాల త్వరగా టాప్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు అని చాలామంది భావించారు. అయితే అతడి ఇమేజ్ మిడిల్ రేంజ్ హీరో స్థాయిని దాటలేకపోతోంది. ఇలాంటి పరిస్థితులలో హీరోల మధ్య పెరిగిపోయిన పోటీ వాతావరణంలో నిలబడి మాస్ హీరోగా తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చు కోవడానికి నాని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసాడు.


ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా నాని లేటెస్ట్ గా నటిస్తున్న ‘దసరా’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీ బడ్జెట్ 60 కోట్లు దాటిపోయినప్పటికీ నాని స్థాయికి మించి ఈమూవీకి బిజినెస్ 80 కోట్ల రేంజ్ లో జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. పాన్ ఇండియా మూవీగా వచ్చేనెల విడుదలకాబోతున్న ఈమూవీ ప్రమోషన్ అదేవిధంగా తన ఇమేజ్ పెంచుకోవడం కోసం నాని ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా తన సొంత ఖర్చుతో చాల కార్యక్రమాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పటివరకు నాని తన ఇమేజ్ పెంచుకోవడం కోసం అభిమాన సంఘాలను మెయింటైన్ చేయడం సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇప్పించుకోవడం అదేవిధంగా తన పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించుకోవడం లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. వాస్తవానికి ఇలాంటి అభిమాన సంఘాల హడావిడికి నాని దూరంగా ఉండేవాడు. అయితే నాని ఈసారి పుట్టినరోజుకు తన రూట్ మార్చుకుని తన 39వ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో 39 లొకేషన్లలో భారీగా పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేయించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


‘దసరా’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాలని ప్రయత్నిస్తున్న నాని ప్రస్తుతం మారిపోయిన టాప్ హీరోల ట్రెండ్ ను అనుసరిస్తూ తాను కూడ పబ్లిసిటీకి దూరం కాదు అన్న సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికితోడు నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్‌గా నిలిచిన ‘అలా మొదలైంది’ సినిమాను రీ రిలీజ్ కు ప్లాన్ చేయడం చూస్తుంటే నాని పూర్తిగా మారిపోయాడు..






RRR Telugu Movie Review Rating

పరిస్థితులతో రాజీపడిపోయిన నాని !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>