EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tapas288ad436-ebf8-4ba5-91d3-7d5c67aaf612-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tapas288ad436-ebf8-4ba5-91d3-7d5c67aaf612-415x250-IndiaHerald.jpgపైలెట్ తో పని లేకుండా కేవలం రిమోట్ తో గాలిలో తిరిగే చిన్న చిన్న వాహనాలను మనం డ్రోన్స్ అంటాం. వీటిని యూ.ఏ.వీలు అంటారు. అంటే అన్ మేనెడ్ ఏరియల్ వెహికల్ అని దాని అర్థం. అయితే భారతదేశం ఇంతకుముందు వరకు ఇలాంటి డ్రోన్స్ ను విదేశాల నుండి కొనుక్కునేది. కానీ ఇప్పుడు భారత దేశం వీటిని స్వదేశంలోనే తయారు చేసుకునే స్టేజ్ కి చేరుకుంది. తాజాగా భారతదేశం యు.ఏ.వీ ల్లో అత్యంత కీలకమైన మరొక డ్రోన్ ని తయారు చేసింది. దానికి తపస్ బి.హెచ్-201 అని పేరు పెట్టారు. "తపస్" అంటే ట్యాక్టికల్ ఎయిర్ బోర్న్ ప్లాట్ ఫామ్ ఫర్ ఏరియల్TAPAS{#}central government;Manam;Indiaతపస్‌ డ్రోన్‌: భారత్ సాధించిన కొత్త అస్త్రం?తపస్‌ డ్రోన్‌: భారత్ సాధించిన కొత్త అస్త్రం?TAPAS{#}central government;Manam;IndiaFri, 24 Feb 2023 06:00:00 GMTపైలెట్ తో పని లేకుండా కేవలం రిమోట్ తో గాలిలో తిరిగే చిన్న చిన్న వాహనాలను మనం డ్రోన్స్ అంటాం. వీటిని యూ.ఏ.వీలు అంటారు. అంటే అన్ మేనెడ్ ఏరియల్ వెహికల్ అని దాని అర్థం. అయితే భారతదేశం ఇంతకుముందు వరకు ఇలాంటి డ్రోన్స్ ను విదేశాల నుండి కొనుక్కునేది. కానీ ఇప్పుడు భారత దేశం వీటిని స్వదేశంలోనే తయారు చేసుకునే స్టేజ్ కి చేరుకుంది.


తాజాగా భారతదేశం యు.ఏ.వీ ల్లో అత్యంత కీలకమైన మరొక డ్రోన్ ని తయారు చేసింది. దానికి తపస్ బి.హెచ్-201  అని పేరు పెట్టారు. "తపస్" అంటే ట్యాక్టికల్ ఎయిర్ బోర్న్ ప్లాట్ ఫామ్ ఫర్ ఏరియల్ సర్వైలెన్స్ . అంటే  వైమానిక నిఘా కోసం తయారైన ఒక వ్యూహాత్మక వైమానిక వేదిక.


ఈ తపస్ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే ఇది 28 వేల అడుగుల ఎత్తులో కూడా ప్రయాణించగలదు. ఇది ఇండిజీనియస్ డెవలప్డ్ మీడియం ఆటిట్యూట్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్. దీన్ని ఢిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ) తయారు చేసింది. డి.ఆర్.డి.ఓ తో పాటుగా హెచ్.ఏ.ఐ.ఎల్ ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఇద్దరు కూడా ఈ డ్రోన్ తయారీలో భాగస్వామ్యం వహించారు.


వీటిని కేవలం సరిహద్దులపై నిఘా పెట్టడం కోసం మాత్రమే కాదు, వచ్చే ఆపదలను కనిపెట్టి దానికి అనుగుణంగా అవసరమైనప్పుడు శత్రువులపై దాడి చేసే విధంగా కూడా వీటిని  సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ డ్రోన్ లో డిజైన్ డెవలపింగ్, ల్యాండింగ్ స్పెషల్, సెన్సార్ స్పెషల్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే తపస్ అనే ఈ డ్రోన్, డ్రోన్ కి ఎక్కువ హెలికాఫ్టర్ కి లేదా విమానానికి తక్కువగా ఉంటుంది. దేశ రక్షణ విషయంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం సైనికులకు ఉపయోగపడే ఎన్నో యుద్ధ పరికరాలను చాలా వరకు తనకు తానుగానే తయారు చేసుకుంటుంది ఇప్పుడు. దానిలో భాగమే తపస్.



RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>