MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish-shankar-problems-becomes-newsc55a81e2-3a7c-4a22-8432-3386b2892128-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish-shankar-problems-becomes-newsc55a81e2-3a7c-4a22-8432-3386b2892128-415x250-IndiaHerald.jpgవరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చి పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ మంచి సన్నిహితుడయ్యాడు. ‘అత్తారింటికి దారేది’ మూవీని బ్లాక్ బష్టర్ హిట్ చేయడంతో త్రివిక్రమ్ పై పవర్ స్టార్ అభిమానులకు మంచి అభిమానం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే ఈ దర్శకులు ఇద్దరు పవన్ ను తమతమ స్థాయిలో ఆకాశానికి ఎత్తేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.కొంతకాలం క్రితం హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’ అన్న టైటిల్ తో ఒక సినిమాను తీస్తున్నట్లుగా ప్రకtrivikram{#}U Turn;harish shankar;kalyan;trivikram srinivas;Pawan Kalyan;Tamil;Remake;Cinemaత్రివిక్రమ్ కు లేని సమస్య హరీష్ శంకర్ కు ఎందుకు వచ్చింది ?త్రివిక్రమ్ కు లేని సమస్య హరీష్ శంకర్ కు ఎందుకు వచ్చింది ?trivikram{#}U Turn;harish shankar;kalyan;trivikram srinivas;Pawan Kalyan;Tamil;Remake;CinemaFri, 24 Feb 2023 11:18:49 GMTవరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చి పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ మంచి సన్నిహితుడయ్యాడు. ‘అత్తారింటికి దారేది’ మూవీని బ్లాక్ బష్టర్ హిట్ చేయడంతో త్రివిక్రమ్ పై పవర్ స్టార్ అభిమానులకు మంచి అభిమానం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే ఈ దర్శకులు ఇద్దరు పవన్ ను తమతమ స్థాయిలో ఆకాశానికి ఎత్తేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.


కొంతకాలం క్రితం హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’ అన్న టైటిల్ తో ఒక సినిమాను తీస్తున్నట్లుగా ప్రకటించగానే పవన్ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఆ టైటిల్ తో సినిమా పట్టాలు ఎక్కలేదు. ఆతరువాత హరీష్ శంకర్ తాను పవన్ తో తీయబోతున్న సినిమా టైటిల్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా ప్రకటించి మరో ట్విస్ట్ ఇవ్వడమే కాకుండా ఆసినిమా తమిళ మూవీ ‘తెరి’ కి రీమేక్ అంటూ లీకులు ఇవ్వగానే హరీష్ శంకర్ ను టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు వేలకొద్ది ట్విట్స్ పెడుతూ పవన్ తో రీమేక్స్ వద్దు అంటూ హరీష్ శంకర్ ను టార్గెట్ చేసారు.


అయితే ఇదే పవన్ అభిమానులు త్రివిక్రమ్ సలహాతో పవన్ ‘వినోదయసితం’ అన్న రీమేక్ లో నటిస్తూ ఉండటం చూసి పవర్ స్టార్ అభిమానులు ఏమాత్రం పట్టించుకోకుండా రీమేక్ సినిమాలో పవన్ ఎందుకు నటిస్తున్నాడు అంటూ అభిమానులు త్రివిక్రమ్ ను టార్గెట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తరువాత నటించిన ‘వకీల్ సాబ్’ అదేవిధంగా పవన్ గత సంవత్సరం నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలు రీమేక్ అయినప్పటికీ ఈ రెండు సినిమాల వెనుక ఉన్న త్రివిక్రమ్ ను పవన్ అభిమానులు ఎందుకు టార్గెట్ చేయడంలేదు అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..



RRR Telugu Movie Review Rating

డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>