MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7a57f7fe-d790-4d50-8232-c605c1d51040-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7a57f7fe-d790-4d50-8232-c605c1d51040-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్లు హీరోలుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే తాజాగా ఓ సీనియర్ విలక్షణ నటుడు హీరోగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయన మరెవరో కాదు ఎన్నో సినిమాల్లో తన విలక్షణ మైన నటన తో ఆకట్టుకున్న రావు రమేష్. ఈయన హీరోగా 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ కీలకపాత్ర పోషిస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ tollywood{#}Raaj Kumar;indraja;lakshman;rao ramesh;Ayushman Khurana;maruti;Huzur Nagar;Coronavirus;KGF;March;Darsakudu;Director;bollywood;India;Cinema;Audienceహీరోగా మారిన విలక్షణ నటుడు రావు రమేష్.. డైరెక్టర్ ఎవరంటే..?హీరోగా మారిన విలక్షణ నటుడు రావు రమేష్.. డైరెక్టర్ ఎవరంటే..?tollywood{#}Raaj Kumar;indraja;lakshman;rao ramesh;Ayushman Khurana;maruti;Huzur Nagar;Coronavirus;KGF;March;Darsakudu;Director;bollywood;India;Cinema;AudienceFri, 24 Feb 2023 14:44:15 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్లు హీరోలుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే తాజాగా ఓ సీనియర్ విలక్షణ నటుడు హీరోగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయన మరెవరో కాదు ఎన్నో సినిమాల్లో తన విలక్షణ మైన నటన తో ఆకట్టుకున్న రావు రమేష్. ఈయన హీరోగా 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ కీలకపాత్ర పోషిస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సౌత్ పాన్ ఇండియా సినిమాలైన పుష్ప, కేజిఎఫ్ సినిమాల తర్వాత రావు రమేష్ చేస్తున్న ఫుల్ లెన్త్ రోల్ మూవీ ఇది.

 ఈ సినిమాలో రావు రమేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈరోజే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో రావు రమేష్ గారిది రెగ్యులర్ క్యారెక్టర్ రోల్ కాదట. ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో రావు రమేష్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగిగా ఈ చిత్రంలో రావు రమేష్ కనిపిస్తాడు. కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య వెల్లడించాడు. ఇక మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని చిత్ర యూనిట్ తెలియజేయవలసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నవాజుద్దీన్ సిద్ధిక్, రాజ్ కుమార్ రావు,

ఆయుష్మాన్ ఖురానా లాంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కరోనా తర్వాత సినీ ఆడియన్స్ ల అభిరుచి కూడా మారిపోయింది. ఓటీటీల ప్రభావం ఎక్కువ అవ్వడంతో జనాలందరూ కూడా ఓటీటీలకు అలవాటుపడ్డారు. అందుకే ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ని ఆదరిస్తున్నారు. ఇక ప్రస్తుతం రావు రమేష్ హీరోగా నటిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా కూడా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం వల్లే నటుడు రావు రమేష్ మరియు మూవీ టీం ఈ సినిమాని తెరకెక్కించడానికి ముందడుగు వేసినట్లు తెలుస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

వీరసింహారెడ్డి: బాలయ్య ఖాతాలో రేర్ రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>