Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-418f4fd5-8bfb-4075-b897-a022ff7e3829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-418f4fd5-8bfb-4075-b897-a022ff7e3829-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విశాల్ కి తాజాగా భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విశాల్ చావు అంచుల వరకు కూడా వెళ్లొచ్చాడని చెప్పవచ్చు. అయితే గతంలో విశాల్ షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగినప్పటికీ చిన్న చిన్న గాయాలతో బయటపడగా ఈసారి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఎప్పుడు ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా చేసే విశాల్ మూవీ షూటింగ్ లో ఇప్పుడు ప్రమాదం జరగడం ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది. కాగా ప్రస్తుతం విశాల్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అందులో భాగంగానే ఓ ఫైట్ సీన్ తీస్తున్నారు. Socialstars lifestyle {#}vishal krishna;Hero;netizensషూటింగ్ స్పాట్ లో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో.....!!షూటింగ్ స్పాట్ లో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో.....!!Socialstars lifestyle {#}vishal krishna;Hero;netizensFri, 24 Feb 2023 08:15:00 GMTతమిళ స్టార్ హీరో విశాల్ కి తాజాగా భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విశాల్ చావు అంచుల వరకు కూడా వెళ్లొచ్చాడని చెప్పవచ్చు. అయితే గతంలో విశాల్ షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగినప్పటికీ చిన్న చిన్న గాయాలతో బయటపడగా ఈసారి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారు.
           ఎప్పుడు ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా చేసే విశాల్ మూవీ షూటింగ్ లో ఇప్పుడు ప్రమాదం జరగడం ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది. కాగా ప్రస్తుతం విశాల్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అందులో భాగంగానే ఓ ఫైట్ సీన్ తీస్తున్నారు.
              దీని కోసం ఫైట్మాస్టర్స్ అంతా రెడీ చేశారు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ యాక్షన్ చెప్పాక వాహనం ఒక్కసారిగా ఫైటర్లపైకి దూసుకొచ్చేసింది. ఆ టైమ్లో సీన్లో విశాల్తో పాటు చాలా మంది ఫైటర్స్ ఉన్నారు. విశాల్ నేల పై మోకాళ్లపై ఉన్నారు. గోడను వెహికిల్ ఢీకొట్టినప్పుడు బ్లాస్ట్ జరిగింది. తర్వాత వాహనం అక్కడ ఆగిపోవాలి కానీ ఏం జరిగిందో తెలియదు. ఆగకుండా ముందుకు దూసుకు వచ్చింది. క్షణాల్లోనే అప్రమత్తమై అంతా పక్కకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ ఓ నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే టెక్నికల్ ఇష్యూ వల్లే ఇలా జరిగిందని యూనిట్ సభ్యులు చెప్పారు. లక్కీగా విశాల్ తో పాటు అక్కడున్న వారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన వీడియోని విశాల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కొన్ని ఇంచుల దూరంలో చావు కనిపించింది అని కామెంట్స్ చేస్తారు. ఆ వీడియోని చూసిన అభిమానులు నెటిజన్స్ జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆ వీడియోలో జరిగిన సన్నివేశాన్ని చూసి షాక్ అవుతున్నారు. విశాల్ గారు అన్నట్టుగా చావు ఇంచ్ ల దూరంలోనే కనిపించింది అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>