LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgడయాబెటిస్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం ఇంకా గుండె సంబంధిత సమస్యలు అలాగే మూత్రసంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఈరోజు చాలా మంది బాధ పడుతున్నారు. మనల్ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉలవలు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉలవల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇవి ఖచ్చితంగా టానిక్ లా HEALTH{#}Horse gram;Iron;Heart;Manamఎదిగే పిల్లలకు, పెద్దలకు ఇది సంపూర్ణ ఆహారం?ఎదిగే పిల్లలకు, పెద్దలకు ఇది సంపూర్ణ ఆహారం?HEALTH{#}Horse gram;Iron;Heart;ManamFri, 24 Feb 2023 22:44:27 GMTఎదిగే పిల్లలకు, పెద్దలకు ఇది సంపూర్ణ ఆహారం?

డయాబెటిస్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం ఇంకా గుండె సంబంధిత సమస్యలు అలాగే మూత్రసంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఈరోజు చాలా మంది బాధ పడుతున్నారు. మనల్ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉలవలు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉలవల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇవి ఖచ్చితంగా టానిక్ లా పని చేస్తాయి. వీటిని వేయించి, ఉడికించి ఇంకా మొలకలుగా చేసి ఎలాగైనా తీసుకోవచ్చు.ఉలవల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.


ఇవి ఆకలిని పెంచడంలో ఇంకా కఫాన్ని తగ్గించడంలో  చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. కళ్ల నుండి నీరు ఎక్కువగా కారుతున్నప్పుడు ఉలవలను తినడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఇతర మూత్రసంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా కూడా ఉంటాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఉలవలను తినడం వల్ల ఎక్కిళ్లు కూడా తగ్గుతాయి. అలాగే వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిసడం వల్ల అజీర్తి, మలబద్దకం ఇంకా గ్యాస్ వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం ఉంటుంది. ఉలవలను ఉడికించి లేదా వాటితో చారును చేసుకుని తినడం వల్ల అన్ని వయసుల వారు వచ్చే స్థూలకాయం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>