LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgఅండు కొర్రలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇతర చిరు ధాన్యాల వలె వీటితో కూడా మనం రొట్టెలను తయారు చేసుకోవడం మంచిది. అండు కొర్రలతో రొట్టెలను తయారు చేయడం కూడా చాలా తేలిక. ముందుగా అండు కొర్రలను బాగా శుభ్రంగా కడిగి నీటిలో పోసి నానబెట్టాలి.తరువాత వీటిని 8 గంటల పాటు నానబెట్టిన తరువాత వడకట్టి ఎండలో పోసి కొంHEALTH{#}chapati;Chiranjeevi;Sugar;Manamఈ రొట్టెలు తింటే షుగర్, గుండె జబ్బులు పరార్?ఈ రొట్టెలు తింటే షుగర్, గుండె జబ్బులు పరార్?HEALTH{#}chapati;Chiranjeevi;Sugar;ManamFri, 24 Feb 2023 22:06:25 GMTఅండు కొర్రలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇతర చిరు ధాన్యాల వలె వీటితో కూడా మనం రొట్టెలను తయారు చేసుకోవడం మంచిది. అండు కొర్రలతో రొట్టెలను తయారు చేయడం కూడా చాలా తేలిక. ముందుగా అండు కొర్రలను బాగా శుభ్రంగా కడిగి నీటిలో పోసి నానబెట్టాలి.తరువాత వీటిని 8 గంటల పాటు నానబెట్టిన తరువాత వడకట్టి ఎండలో పోసి  కొంచెం సేపు ఆరబెట్టాలి. ఇవి బాగా ఎండిన తరువాత కళాయిలో వేసి వాటిని దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని పిండిగా చేసుకోవాలి. ఇక ఒక కిలో అండు కొర్రల పిండికి 100 గ్రాముల మినపప్పును పిండిగా చేసి కలపాలి.


తరువాత ఇలా తయారు చేసుకున్న పిండిని తగిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఉప్పుని వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ నెమ్మదిగా రొట్టె ఆకారంలో చపాతీ కర్రతో అలా వత్తుకోవాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న రొట్టెను బాగా కాలిన పెనం పై వేసి కాల్చుకోవాలి. అయితే ఈ రొట్టెను కాలడానికి కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. ఈ రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే అండు కొర్రల రొట్టె తయారవుతుంది. అయితే మీరు పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే ఈ రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి. కావాలంటే ఈ పిండిలో పెరుగు వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న రొట్టెలను ఏ కూరతోనైనా పుష్కలంగా తినవచ్చు. ఈ విధంగా అండు కొర్రలతో రొట్టెలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>