MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8a944614-0165-44ba-a826-fefbd65f0761-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8a944614-0165-44ba-a826-fefbd65f0761-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే రెండేసి సినిమాలను సైన్ చేసి వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్స్ తో స్టార్ స్టేటస్ అందుకున్న యువ దర్శకులకు మన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం ఇష్టం లేకనో లేదా ఇతర కారణం వల్లనో తెలియదు కానీ మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కొందరు తమిళ అగ్ర హీరోల వద్దకి tollywood{#}karthikeyan;prince;vamsi paidipally;vijay deverakonda;Chennai;Ishtam;Kollywood;Yuva;producer;Producer;Joseph Vijay;vamsi;mahesh babu;Hero;Darsakudu;Tollywood;Blockbuster hit;Tamil;Director;Cinema;Ram Charan Tejaతమిళ హీరోలనే నమ్ముకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్లు..?తమిళ హీరోలనే నమ్ముకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్లు..?tollywood{#}karthikeyan;prince;vamsi paidipally;vijay deverakonda;Chennai;Ishtam;Kollywood;Yuva;producer;Producer;Joseph Vijay;vamsi;mahesh babu;Hero;Darsakudu;Tollywood;Blockbuster hit;Tamil;Director;Cinema;Ram Charan TejaFri, 24 Feb 2023 13:05:00 GMTప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే రెండేసి సినిమాలను సైన్ చేసి వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్స్ తో స్టార్ స్టేటస్ అందుకున్న యువ దర్శకులకు మన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం ఇష్టం లేకనో లేదా ఇతర కారణం వల్లనో తెలియదు కానీ మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కొందరు తమిళ అగ్ర హీరోల వద్దకి వెళ్తున్నట్లు సమాచారం.

 ఈ క్రమంలోనే జాతి రత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ ఆ తర్వాత తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ తీశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినా కూడా అనుదీప్ తో సినిమాలు చేసేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి తలపతి విజయ్తో 'వారిసు' సినిమాని తెరకెక్కించాడు.ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సుమారు 300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో మరోసారి వంశీ తో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి కూడా విజయ్ తోనే సినిమా తీయాలని అనుకుంటున్నాడట. మళ్లీ మిడిల్ రేంజ్ హీరోల జోలికి వెళ్లడం లేదు. ఇక సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురాం కూడా అంతే.

 మహేష్ బాబు సినిమా తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఎందుకనో అది సెట్ అవ్వలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో మూవీ ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్టుకి ఓ బడా నిర్మాత అడ్డుపడ్డాడు. దీంతో తెలుగులో మరో మీడియం రేంజ్ హీరో జోలికి వెళ్లకుండా వెంటనే చెన్నై వెళ్లి తమిళ్ హీరో కార్తీ ని ఒప్పించాడు. వీరి కాంబోలో మూవీ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే. ఇక చెన్నైలోనే ఈ మూవీ స్క్రిప్ట్ పనులను స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట పరశురాం. ఇలా ఇక్కడి స్టార్ హీరోలు ఖాళీ లేకపోవడంతో మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఉన్న టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>