MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-jayalalitha8763851a-52d6-4cf3-a344-65fb4a02e8e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-jayalalitha8763851a-52d6-4cf3-a344-65fb4a02e8e7-415x250-IndiaHerald.jpgఅందాల తారగా ఎంతోమంది హీరోల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1948 ఫిబ్రవరి 24వ తేదీన మైసూర్ లో జన్మించిన జయలలిత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయలలిత కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఇక 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయి.. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకుంది. ఆHBD;JAYALALITHA{#}jayalalitha;Rajya Sabha;Tamilnadu;Kannada;september;Telangana Chief Minister;court;Arrest;February;December;Telugu;CinemaHBD Jayalalitha: జయలలిత సినీ , రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..?HBD Jayalalitha: జయలలిత సినీ , రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..?HBD;JAYALALITHA{#}jayalalitha;Rajya Sabha;Tamilnadu;Kannada;september;Telangana Chief Minister;court;Arrest;February;December;Telugu;CinemaFri, 24 Feb 2023 08:03:19 GMTఅందాల తారగా ఎంతోమంది హీరోల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1948 ఫిబ్రవరి 24వ తేదీన మైసూర్ లో జన్మించిన జయలలిత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయలలిత కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఇక 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయి.. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకుంది.

ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అవడంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కూడా రద్దయింది.  ఇకపోతే పదవిలో ఉండగానే కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి కూడా ఈమె కావడం గమనార్హం.. ఇకపోతే ఆ తర్వాత 2015 మే 11వ తేదీన కర్ణాటక న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టడం జరిగింది.  దాంతో ఈమె మే 23వ తేదీ నుంచి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టింది. ఇకపోతే 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటల సమయంలో చెన్నైలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించింది. ఆమె మరణాన్ని కంటే ముందు సుమారుగా రెండున్నర నెలలుగా అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది ఇక డిసెంబర్ 6వ తేదీన అంతేక్రియలు పూర్తి చేశారు.

తెలుగులో ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే 1965లో కథానాయకుని కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత సుమారుగా 42 చిత్రాలకు పైగా నటించి.. 1980లో చివరిగా నాయకుడు వినాయకుడు అనే సినిమా తర్వాత, తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది. తెలుగు, తమిళ్,  కన్నడ సినిమాలలో 140కి పైగా చిత్రాలలో నటించి  మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత రాజకీయాలలో కూడా విప్లవ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ కూడా తమిళనాడు ప్రజలు ఈమెను అమ్మ అని ఆప్యాయతగా పిలుచుకుంటారు.



RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>