SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pv-sindhua4074039-bbdd-47c9-bfa3-f19223933599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pv-sindhua4074039-bbdd-47c9-bfa3-f19223933599-415x250-IndiaHerald.jpgతెలుగు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత అయిన పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్ తో కొన్ని కారణాల వల్ల తెగతెంపులు చేసుకుంది.ఏకంగా నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్ లోనే రాటుదేలిన సింధు... ఇక ఇప్పుడు కొత్త కోచ్ ని వెతికే పనిలో ఉంది. ఈ విషయాన్ని పార్క్ శుక్రవారం నాడు (ఫిబ్రవరి 24) ధృవీకరించాడు. 2023 సీజన్ స్టార్టింగ్ అంత బాగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ పార్క్ వెల్లడించడం జరిగింది.2019 వ సంవత్సరపు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ సింధుతో కలిసి PV SINDHU{#}pv sindhu;Winner;Tokyo;Athadu;Friday;Malaysia;India;mediaPV సింధు: పాత కోచ్ కి గుడ్ బై.. కొత్త కోచ్ కోసం సెర్చింగ్?PV సింధు: పాత కోచ్ కి గుడ్ బై.. కొత్త కోచ్ కోసం సెర్చింగ్?PV SINDHU{#}pv sindhu;Winner;Tokyo;Athadu;Friday;Malaysia;India;mediaFri, 24 Feb 2023 19:36:10 GMTతెలుగు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత అయిన పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్ తో కొన్ని కారణాల వల్ల తెగతెంపులు చేసుకుంది.ఏకంగా నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్ లోనే రాటుదేలిన సింధు... ఇక ఇప్పుడు కొత్త కోచ్ ని వెతికే పనిలో ఉంది. ఈ విషయాన్ని పార్క్ శుక్రవారం నాడు (ఫిబ్రవరి 24) ధృవీకరించాడు. 2023 సీజన్ స్టార్టింగ్ అంత బాగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ పార్క్ వెల్లడించడం జరిగింది.2019 వ సంవత్సరపు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ సింధుతో కలిసి పని చేస్తున్నాడు. ఫస్ట్ లో అతన్ని మెన్స్ సింగిల్స్ కోచ్ గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా కానీ ఆ తర్వాత అతను సింధు వ్యక్తిగత కోచ్ అయ్యాడు. పార్క్ కోచింగ్ లో సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్ ఇంకా టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ ఇంకా అలాగే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలవడం జరిగింది.


అయితే ఈ సంవత్సరం మాత్రం సింధు వరుస వైఫల్యాలు చవిచూసింది. గత సంవత్సరం మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు ఆమె బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉంది. ఇక టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ లోనూ పాల్గొనలేదు. ఈ సంవత్సరం మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ లలో సింధు ఫస్ట్ రౌండ్లలోనే ఇంటిదారి పట్టింది. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్ లో కూడా సింధు ఆడినా.. సెమీఫైనల్లో మాత్రం తాను ఓడిపోయింది.ఇక సింధు కోచ్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ టే సాంగ్ ఓ ఎమోషనల్ పోస్ట్ ని కూడా చేశాడు. ఈ మధ్య కాలంలో పీవి సింధు వైఫల్యాలకు కోచ్ గా తనదే బాధ్యత అని అతడు స్పష్టం చేశాడు. అందుకే సింధు మార్పు కోసం చూస్తోందని, ఓ కొత్త కోచ్ వేటలో ఉన్నట్లు అతను తెలిపాడు. ఆమె నిర్ణయాన్ని గౌరవించి తాను తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.



RRR Telugu Movie Review Rating

ఆవారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న లింగుస్వామి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>