ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/megalaya676b9e31-a9c7-42fe-a19c-e4246b6e4dcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/megalaya676b9e31-a9c7-42fe-a19c-e4246b6e4dcf-415x250-IndiaHerald.jpgమేఘాలయ ఇది భూతలంపై దేవతలు సృష్టించిన స్వర్గంగా హిందూ పురాణాల ద్వారా చెప్పుకుంటారు. పచ్చని లోయలు ఇంకా అడవుల గుండా ప్రవహించే నదులు అలాగే కొండలపై జాలువారుతున్న జలపాతాలు ఇంకా ప్రకృతి సోయగాలు.ఇది ఒక్కసారి వెళ్తే పదే పదే వెళ్లానిపించే అందమైన రాష్ట్రం.అక్కడి అందమైన ప్రదేశాల్లో కాంగ్ థాంగ్ గ్రామం కూడా ఒక్కటి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 700మందికి పైగా జనాలు ఉంటారు. ఇక ఈ గ్రామం తూర్పు ఖాసి హీల్స్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంకి ఒక ప్రత్యేకత ఉందMEGALAYA{#}prakruti;Whistle;Capital;Manam;villageఆ గ్రామంలో జనాలకు మాటల్లేవ్.. ఓన్లీ విజిల్సే?ఆ గ్రామంలో జనాలకు మాటల్లేవ్.. ఓన్లీ విజిల్సే?MEGALAYA{#}prakruti;Whistle;Capital;Manam;villageThu, 23 Feb 2023 18:30:35 GMTప్రకృతి సోయగాలు.ఇది ఒక్కసారి వెళ్తే పదే పదే వెళ్లానిపించే అందమైన రాష్ట్రం.అక్కడి అందమైన ప్రదేశాల్లో కాంగ్ థాంగ్ గ్రామం కూడా ఒక్కటి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 700మందికి పైగా జనాలు ఉంటారు. ఇక ఈ గ్రామం తూర్పు ఖాసి హీల్స్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం.ఇప్పటి దాకా మనం ఎన్నో గ్రామాల గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలు లేదా విచిత్రమైన వాతావరణం గురించి చాలానే తెలుసుకున్నాం. కానీ ఈ కాంగ్ థాంగ్ గ్రామం లాంటి విచిత్రమైన గ్రామం గురించి ఎప్పుడూ కూడా విని ఉండే ఛాన్సే లేదు. ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా కూడా అవార్డును గెలుచుకుంది. వీరికి పదాలను ఉపయోగించే భాష లేదట.


అందుకే దీనిని విజిల్ విలేజ్ అని అంటారు. ఇక్కడి గ్రామస్థులు తమ తోటివారిని పేర్ల పెట్టి అస్సలు పిలవరు. ఒక రాగంతో వారిని పిలుస్తారు. అదే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. తాము చెప్పాలనుకున్న సందేశాలను కూడా ఈలల ద్వారా చెబుతుంటారు. అయితే ఇక్కడ ఉండే గ్రామస్థులకు కూడా రెండు పేర్లు ఉంటాయి. ఇక ఒకటి సాధారణ పేరు కాగా మరొకటి పాట పేరు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.అందరికీ కూడా విభిన్న రాగాలతో ట్యూన్స్ ఉన్నాయి.ఇక ఆ గ్రామానికి చెందిన ఫివ్ స్టార్ ఖోంగ్ సిట్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని పిలించేందుకు వాడే ట్యూన్ ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అక్కడ గ్రామస్తుడు మరణిస్తే అతనితోపాటు అతన్ని పిలిచే ట్యూన్ కూడా చనిపోతుందట. అక్కడ ప్రతి ఒక్క గ్రామాస్థుడిని ఒక్కో రాగంతో పిలుచుకుంటారు.
" style="height: 669px;">




RRR Telugu Movie Review Rating

'ప్రాజెక్ట్ K' నైజాం రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>