EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane3ed8d5c-edae-4797-8a6d-0439379746aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane3ed8d5c-edae-4797-8a6d-0439379746aa-415x250-IndiaHerald.jpgప్రతిపక్షాలను విలన్ గా చూడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి సర్వే చేశారు. దాదాపు 30 లక్షల మంది అభిప్రాయాలను తీసుకున్నారు. మీ సమస్యలు ఏమిటి ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారనే వివరాలతో సర్వే చేపట్టారు. అందులో ముఖ్యమైన విషయాలు బయటకొచ్చాయి. ఆకాశన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బంది అని 26 శాతం మంది చెప్పారు. మద్యం, మాదక ద్రవ్యాలతో ఇబ్బందులు 24 శాతం, నిరుద్యోగం 24 శాతం, విద్యుత్ సమస్యలు 23.5 శాతం, ఇసుక మాఫియా 23. 5 శాతం, అధ్వాన రహదారులు 23 శాతం, లోపించిన అభివృద్ది 23 శాతంjagan{#}Telugu Desam Party;Jagan;Government;electricity;Survey;TDP;YCPఆ టీడీపీ సర్వే.. జగన్‌కు మేలు చేస్తుందా?ఆ టీడీపీ సర్వే.. జగన్‌కు మేలు చేస్తుందా?jagan{#}Telugu Desam Party;Jagan;Government;electricity;Survey;TDP;YCPThu, 23 Feb 2023 08:00:00 GMTప్రతిపక్షాలను విలన్ గా చూడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి సర్వే చేశారు. దాదాపు 30 లక్షల మంది అభిప్రాయాలను తీసుకున్నారు. మీ సమస్యలు ఏమిటి ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారనే వివరాలతో సర్వే చేపట్టారు. అందులో ముఖ్యమైన విషయాలు బయటకొచ్చాయి. ఆకాశన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు  ఇబ్బంది అని 26 శాతం మంది చెప్పారు.


మద్యం, మాదక ద్రవ్యాలతో ఇబ్బందులు 24 శాతం, నిరుద్యోగం 24 శాతం, విద్యుత్ సమస్యలు 23.5 శాతం, ఇసుక మాఫియా 23. 5 శాతం, అధ్వాన రహదారులు 23 శాతం, లోపించిన అభివృద్ది 23 శాతం, అవినీతి 22 శాతం, మహిళలకు లోపించిన భద్రత 22. 75శాతం, నిధుల దుర్వినియోగం 21 శాతం, పంటల గిట్టుబాటు ధర లేకపోవడం 20.8 శాతం, తాగునీటి సమస్య, 20.75 శాతం, మూడు రాజధానుల అంశం 20 శాతం, నిలకడ లేని ప్రభుత్వ పాలన 19 శాతం అని ప్రజలు భావిస్తున్నట్లు టీడీపీ చేపట్టిన సర్వేలో వెల్లడైన అంశాలు.


అయితే ఇందులో వైసీపీ కొంచెం బెటర్ గానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా భారీ వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలినట్లు లేదు. ఈ సర్వేలో ఎక్కడా 20 నుంచి 25 శాతం వ్యతిరేకత లేదు. దీన్ని వైసీపీ బలంగా మార్చుకోగలగాలి. ఇదే సమయంలో నిత్యావసర ధరలు తగ్గించేందుకు కృషి చేయాలి.


ఏవైతే నిత్యావసరాలు ఎక్కువగా ప్రజలు వినియోగిస్తారో వాటిని తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మరొక అంశం మద్యం.. దీనిపై ఇప్పటికే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినా జగన్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పారు. నిరుద్యోగం అంశంపై వైసీపీ దృష్టి సారిస్తే మేలు.  30 లక్షల మంది అభిప్రాయాలను గౌరవించి వైసీపీ తన తప్పులను సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి.



RRR Telugu Movie Review Rating

లైగర్ దెబ్బకు డీలా పడ్డ అనన్య పాండే...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>