Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaa8a00576-0396-4270-b346-7772027a0c3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaa8a00576-0396-4270-b346-7772027a0c3f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోలు కేవలం ఒక్క భాష మార్కెట్ మీదే కాకుండా.. అన్ని భాషల్లో కూడా తమ సినిమాను విడుదల చేసి ఇక అక్కడ మార్కెట్ ని పెంచుకోవాలని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలతోనే ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు పాన్ ఇండియా అనే పదాన్ని టచ్ చేయని తమిళ స్టార్ హీరో సూర్య తన 42 వ సినిమాను మాత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. ఈ విషయంలో లోకనాయకుడు కమలహాసన్ తోSurya{#}surya sivakumar;vegetable market;Audience;Hero;Cinema;Tamil;Indiaకమల్, విక్రమ్ బాటలోనే సూర్య.. తన నెక్స్ట్ సినిమాలో?కమల్, విక్రమ్ బాటలోనే సూర్య.. తన నెక్స్ట్ సినిమాలో?Surya{#}surya sivakumar;vegetable market;Audience;Hero;Cinema;Tamil;IndiaThu, 23 Feb 2023 13:00:00 GMTఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోలు కేవలం ఒక్క భాష మార్కెట్ మీదే కాకుండా.. అన్ని భాషల్లో కూడా తమ సినిమాను విడుదల చేసి ఇక అక్కడ మార్కెట్ ని పెంచుకోవాలని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలతోనే ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు పాన్ ఇండియా అనే పదాన్ని టచ్ చేయని తమిళ స్టార్ హీరో సూర్య తన 42 వ సినిమాను మాత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట.


 ఈ విషయంలో లోకనాయకుడు కమలహాసన్ తో పాటు మరో స్టార్ హీరో విక్రమ్ బాటలోనే  సూర్య కూడా అడుగులు వేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. వారి మాదిరిగానే ఒకే సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట సూర్య. పిరియాడిక్ ఎపిక్ యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సూర్య ఏకంగా ఐదు డిఫరెంట్ పాత్రలలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడట.  అంతేకాదు ఇక ఈ సినిమాను ఏకంగా 10 భాషలలో రిలీజ్ చేయాలని సూర్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.



 ఈ సినిమాకి వీర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. ఇక ఈ మూవీ 1678 కాలంలో జరిగే కథ ఆధారంగానే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. సూర్య ఈ సినిమాలో యోధుడిగా కనిపించబోతున్నాడట. అయితే అలెగ్జాండర్ కథతో ఈ సినిమా లింక్ అయి వస్తుందని మరి కొంతమంది కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే సాధారణంగానే ఏదైనా పాత్రలో సూర్య నటించాడు అంటే చాలు ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటాడు. అలాంటిది ఐదు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు అని తెలియడంతో సూర్య నట విశ్వరూపం చూడటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

తెలంగాణ: చిన్నారిపై కోతి దాడి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>