HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thyroid-79896b7e-2b40-44ef-a358-852d972b6ae6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thyroid-79896b7e-2b40-44ef-a358-852d972b6ae6-415x250-IndiaHerald.jpgథైరాయిడ్ కు మందులను వాడడం వల్ల కూడా మనం చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలను పాటించడం వల్ల మనం థైరాయిడ్ ని తగ్గించుకోవచ్చు. ఇక థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు శారీరక శ్రమని ఎక్కువగా చేయాలి. అలాగే శరీరమంతా కదిలేలా ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అదే విధంగా ఆహారంలో నువ్వులు, కొబ్బరి, పల్లీలు ఇంకా బెల్లం వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నువ్వుల నుండి నూనె తీయగా వచ్చిన తెలగ పిండిని కూడా ఆహTHYROID {#}gummadi;Mandula;oil;cumin;Jaggery;Cheque;Manamమందులు వాడకుండా థైరాయిడ్ కి చెక్ పెట్టాలంటే?మందులు వాడకుండా థైరాయిడ్ కి చెక్ పెట్టాలంటే?THYROID {#}gummadi;Mandula;oil;cumin;Jaggery;Cheque;ManamThu, 23 Feb 2023 21:06:27 GMTమందులు వాడకుండా థైరాయిడ్ కి చెక్ పెట్టాలంటే ?

థైరాయిడ్ కు  మందులను వాడడం వల్ల కూడా మనం చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలను పాటించడం వల్ల మనం థైరాయిడ్ ని తగ్గించుకోవచ్చు. ఇక థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు శారీరక శ్రమని ఎక్కువగా చేయాలి. అలాగే శరీరమంతా కదిలేలా ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అదే విధంగా ఆహారంలో నువ్వులు, కొబ్బరి, పల్లీలు ఇంకా బెల్లం వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నువ్వుల నుండి నూనె తీయగా వచ్చిన తెలగ పిండిని కూడా ఆహారంగా తీసుకోవాలి. అదే విధంగా వీలైనంత దాకా సముద్రపు ఉప్పును ఆహారంగా తీసుకోవాలి. అదే విధంగా గుమ్మడికాయను ఇంకా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ చాలా త్వరగా నియంత్రణలోకి వస్తుంది.


ఇంకా అలాగే ఖచ్చితంగా బొప్పాయి పండును కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పెసరపప్పు, బియ్యం ఇంకా బెల్లం తో కిచిడీని తయారు చేసుకుని తినాలి. బెల్లం, జీలకర్ర పొడి కలిపి తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా నియంత్రణలోకి వస్తుంది. వీటితో పాటు శరీరానికి ఎండ తగిలేలా ఖచ్చితంగా చూసుకోవాలి. సూర్యోదయ సమయంలో వచ్చే ఎండలో కూర్చోవడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా ఇంకా త్వరగా అదుపులోకి వస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ కూడా తగిన వ్యాయామం చేయడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నియమాలను పాటించడం వల్ల థైరాయిడ్ సమస్యకు వాడే మందుల మోతాదు కూడా తగ్గుతుంది. దీంతో మనం మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన  పడకుండా ఉంటాము.



RRR Telugu Movie Review Rating

మోహన్ లాల్ కి షాక్ ఇచ్చిన ఏనుగు దంతాల కేసు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>