SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2023-women-semis583c469b-49b7-4314-82b5-05a9600c4db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2023-women-semis583c469b-49b7-4314-82b5-05a9600c4db6-415x250-IndiaHerald.jpgమహిళల టీ 20 వరల్డ్ కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. మొత్తం పది జట్లతో మొదలైన ఈ పొట్టి ప్రపంచ కప్ లో చివరికి నాలుగు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రూప్ ఏ నుండి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు సెమీస్ కు చేరుకోగా ... ఆ గ్రూప్ లో మిగిలిన న్యూజిలాండ్ , శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్లకు నిరాశే మిగిలింది. అదే విధంగా గ్రూప్ బి నుండి ఇంగ్లాండ్ మరియు ఇండియా లు సెమీస్ కు చేరుకోగా ... వెస్ట్ ఇండీస్ , పాకిస్తాన్ మరియు ఐర్లాండ్ లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. T20-WORLD-CUP-2023-WOMEN-SEMIS{#}Bangladesh;New Zealand;Sri Lanka;Evening;Cape Town;South Africa;England;Ireland;Pakistan;Yevaru;World Cup;Australia;Success;IndiaWORLD CUP 2023: ఇండియా ఫైనల్ చేరాలంటే... ఆస్ట్రేలియాను ఎలా అడ్డుకోవాలి !WORLD CUP 2023: ఇండియా ఫైనల్ చేరాలంటే... ఆస్ట్రేలియాను ఎలా అడ్డుకోవాలి !T20-WORLD-CUP-2023-WOMEN-SEMIS{#}Bangladesh;New Zealand;Sri Lanka;Evening;Cape Town;South Africa;England;Ireland;Pakistan;Yevaru;World Cup;Australia;Success;IndiaThu, 23 Feb 2023 10:29:02 GMTమహిళల టీ 20 వరల్డ్ కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. మొత్తం పది జట్లతో మొదలైన ఈ పొట్టి ప్రపంచ కప్ లో చివరికి నాలుగు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రూప్ ఏ నుండి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు సెమీస్ కు చేరుకోగా ... ఆ గ్రూప్ లో మిగిలిన న్యూజిలాండ్ , శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్లకు నిరాశే మిగిలింది. అదే విధంగా గ్రూప్ బి నుండి ఇంగ్లాండ్ మరియు ఇండియా లు సెమీస్ కు చేరుకోగా ... వెస్ట్ ఇండీస్ , పాకిస్తాన్ మరియు ఐర్లాండ్ లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. ఈ రోజు సాయంత్రం గ్రూప్ ఏ లో టాపర్ గా నిలిచిన ఆస్ట్రేలియా గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన ఇండియా మహిళల జట్లు తొలి సెమీస్ లో కేప్ టౌన్ వేదికగా తలపడనున్నాయి.

పేపర్ మీద చూసుకుంటే రెండు జట్లు బలంగా ఉన్నాయి. కానీ గ్రౌండ్ లో దిగాక ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారికే విజయం దక్కుతుంది. అయితే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా తామాడిన నాలుగు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే.. ఇండియా మాత్రం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఒక అడుగు దిగువన ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ ను దక్కించుకొని ఇండియా ఈసారి ఎలాగైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలన్న కసితో ఉంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తులో సక్సెస్ రేట్ తో దూసుకుపోతోంది.

ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపు సాధించాలంటే మొదట టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఒకవేళ ఛేజింగ్ ఆస్ట్రేలియా కు వెళితే 180 +పరుగులు అయినా  సునాయాసంగా చేధించగలదు. ముఖ్యంగా ఈ టీం లో హీలీ, మూనీ, లానింగ్, పెర్రీ , గార్డనర్ , మెక్ గ్రాత్ లు బ్యాటింగ్ లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారనున్నారు. వీరిని అడ్డుకోగలిగితే ఇండియా ఫైనల్ చేరడం ఈజీ అవుతుంది. అదే సమయంలో ఇండియా ఆటగాళ్లు సైతం అంచనాలకు తగినట్లు రాణించాలి. మరి చూద్దాం ఈ రోజు జరగనున్న మొదటి సెమి ఫైనల్ లో గెలిచి ఫైనల్ బెర్త్ ను ఎవరు దక్కించుకుంటారో ?  



RRR Telugu Movie Review Rating

గతేడాదే నాకు పెళ్లి అయిపోయింది అంటూ షాక్ ఇచ్చిన రకుల్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>