Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/direcotr7a8a9f04-9f75-4e56-ada4-8ac0de25e530-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/direcotr7a8a9f04-9f75-4e56-ada4-8ac0de25e530-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలదే హవా.. ఎక్కువగా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ మరోసారి హిట్ అందుకుంటున్నారు. అయితే ఇక ఇలా రిమేక్ సినిమాలతో హీరోలకు కూడా ఊహించని రీతిలో పాపులారిటీ వస్తుంది అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ ఇలా రీమేక్ సినిమాలతో హిట్టు కొడుతున్న దర్శకులకు మాత్రం ఈ రిమేక్ సినిమాలు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడటం లేదు. కొంత కొంతకాల నుంచి రీమేక్ తో హిట్టు కొట్టిన దర్శకులు ఆDirecotr{#}Kumaar;editor mohan;v v vinayak;Yuva;Venu Sreeram;Nayak;Katamarayudu;God Father;Chiranjeevi;kalyan;Remake;Tollywood;Director;Cinemaరీమేక్ తో హిట్టు కొట్టిన.. అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్న డైరెక్టర్స్?రీమేక్ తో హిట్టు కొట్టిన.. అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్న డైరెక్టర్స్?Direcotr{#}Kumaar;editor mohan;v v vinayak;Yuva;Venu Sreeram;Nayak;Katamarayudu;God Father;Chiranjeevi;kalyan;Remake;Tollywood;Director;CinemaThu, 23 Feb 2023 16:00:00 GMTగత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలదే హవా.. ఎక్కువగా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ మరోసారి హిట్ అందుకుంటున్నారు. అయితే ఇక ఇలా రిమేక్ సినిమాలతో హీరోలకు కూడా ఊహించని రీతిలో పాపులారిటీ వస్తుంది అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ ఇలా రీమేక్ సినిమాలతో హిట్టు కొడుతున్న దర్శకులకు మాత్రం ఈ రిమేక్ సినిమాలు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడటం లేదు. కొంత కొంతకాల నుంచి రీమేక్ తో హిట్టు కొట్టిన దర్శకులు ఆఫర్లు లేక ఖాళీగా ఉంటున్నారు అని చెప్పాలి.



 గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజా గాడ్ ఫాదర్ అనే సినిమాను తీశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు మెగాస్టార్ సినిమా రీమేక్. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఆ తర్వాత మోహన్ రాజాకు అవకాశాలే లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇక మరో డైరెక్టర్ కిషోర్ కుమార్ సైతం కాటమరాయుడు అనే ఒక రిమేక్ సినిమా తర్వాత ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు అని చెప్పాలి. అయితే రిమేక్ సినిమాలను పతెరకెక్కించడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న వివి వినాయక్ కెరియర్ కూడా ప్రస్తుతం ఆశాజనకంగా లేదు అని చెప్పాలి.



 ఇకపోతే పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే రీమేక్ సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నాడు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర. ఇక అతని పరిస్థితి కూడా ప్రస్తుతం ఆశించిన రేంజ్ లో లేదు అని చెప్పాలి. ఇక మరోవైపు వేణు శ్రీరామ్ కి కూడా కొత్త ఆఫర్లు ఏవి తలుపు తట్టడం లేదు. అయితే ఇక ఇలా రీమేక్ సినిమాలను తీసి సూపర్ హిట్ కొట్టిన తర్వాత కూడా అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఇక రీమేక్ అనే పేరు వినిపిస్తేనే  ఎంతోమంది దర్శకులు భయపడిపోతున్నారట.



RRR Telugu Movie Review Rating

బాలీవుడ్ హీరోతో బన్నీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>