EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/israel751f4945-4f3a-45d4-aebf-74aa84c4c658-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/israel751f4945-4f3a-45d4-aebf-74aa84c4c658-415x250-IndiaHerald.jpgఇజ్రాయిల్ దేశం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని ఇబ్బంది పెట్టే వారిని, దేశం పైన దాడి చేసే వారిని దేశ ద్రోహులుగా గుర్తిస్తూ దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించుకుంది. కానీ భారత దేశంలో మన దేశంలో ఉంటూ దేశంపై విషం చిమ్ముతూ, దుర్భాషలాడుతున్న చాలా మందిని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇండియాలో దేశం గురించి నీచంగా మాట్లాడినా కనీసం అరెస్టు కూడా చేయలేని పరిస్థితి. ఏమైనా అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం ఇండియాలో అలవాటయిపోయింది. అలాంటి వారిపై భారత్ లో చర్యలు తీసుకున్న దాఖలాలISRAEL{#}Israel;Prime Minister;Indiaటెర్రర్‌ షాక్‌: ఇజ్రాయిల్ అద్భుత నిర్ణయం?టెర్రర్‌ షాక్‌: ఇజ్రాయిల్ అద్భుత నిర్ణయం?ISRAEL{#}Israel;Prime Minister;IndiaWed, 22 Feb 2023 05:00:00 GMTఇజ్రాయిల్ దేశం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని ఇబ్బంది పెట్టే వారిని, దేశం పైన దాడి చేసే వారిని దేశ ద్రోహులుగా గుర్తిస్తూ దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించుకుంది. కానీ భారత దేశంలో మన దేశంలో ఉంటూ దేశంపై విషం చిమ్ముతూ, దుర్భాషలాడుతున్న చాలా మందిని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇండియాలో దేశం గురించి నీచంగా మాట్లాడినా కనీసం అరెస్టు కూడా చేయలేని పరిస్థితి.


ఏమైనా అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం ఇండియాలో  అలవాటయిపోయింది. అలాంటి వారిపై భారత్ లో చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇలాంటి ఒక ఘటన ఇజ్రాయిల్ దేశంలో  జరిగింది. ఇజ్రాయిల్ సుప్రీం కోర్టులో ఆ దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం న్యాయవ్యవస్థలపై కీలకమైన సవరణలు చేసింది. కీలక చట్టం తీసుకొచ్చింది.


ఇజ్రాయిల్ అందరూ యూదులు ఉంటారనుకుంటారు. కానీ 80 శాతం మంది యూదులు ఉంటే 20 శాతం వరకు అరబ్బులు కూడా నివసిస్తారు. ఈ మధ్య కాలంలో అక్కడ ఉండే అరబ్బులు యూదులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ అరబ్బులను ఎవరో ప్రోత్సహించి వారిపై దాడులు చేసేలా చేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపణలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి నాలుగైదు ఘటనలు ఇజ్రాయిల్ లో చోటు చేసుకున్నాయి. తీవ్ర వాదులతో మాట్లాడిన, వారితో స్నేహం చేసినా, వారి పట్ల కనీసం సానుభూతి చూపించినా, ఒక వేళ తీవ్ర వాదిగా మారిన వారిని తక్షణమే ఇజ్రాయిల్ నుంచి వెళ్లగొట్టాలని ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.


ఈ నిర్ణయం వల్ల దేశంలో ఉంటూ దేశ రక్షణ వ్యవస్థపై బురద చల్లాలని దేశంలో అలజడులు రేపాలని చూసే వారికి ఇదొక గుణపాఠం. ఏ మాత్రం దేశాన్ని కించపరిచినా ఇక నుంచి ఇజ్రాయిల్ లో  దేశ బహిష్కరణ తప్పదు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ పైన ఆపరేషన్ స్టార్ట్ చేశారా ?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>