Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/eliphant9faa908d-4cce-42a7-93d2-d8f16d29ea60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/eliphant9faa908d-4cce-42a7-93d2-d8f16d29ea60-415x250-IndiaHerald.jpgఒకప్పుడు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వచ్చి ఇక పంట పొలాలను పూర్తిగా దగ్ధం చేయడం లాంటివి చేసేవి ఏనుగులు. అయితే ఇటీవల కాలంలో మాత్రం పంట పొలాలతో మాత్రమే ఆగడం లేదు. ఏకంగా జనావాసాల్లోకి వస్తూ దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రజలు వరుసగా ఏనుగుల దాడుల నేపథ్యంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జార్ఖండ్ లోని ఐదు జిల్లాల ప్రజలకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాEliphant{#}Evening;Jharkhandఏనుగుల బీభత్సం.. 12 రోజుల్లో ఎంతమందిని చంపాయో తెలుసా?ఏనుగుల బీభత్సం.. 12 రోజుల్లో ఎంతమందిని చంపాయో తెలుసా?Eliphant{#}Evening;JharkhandWed, 22 Feb 2023 08:21:41 GMTఒకప్పుడు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వచ్చి ఇక పంట పొలాలను పూర్తిగా దగ్ధం చేయడం లాంటివి చేసేవి ఏనుగులు. అయితే ఇటీవల కాలంలో మాత్రం పంట పొలాలతో మాత్రమే ఆగడం లేదు. ఏకంగా జనావాసాల్లోకి వస్తూ దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రజలు వరుసగా ఏనుగుల దాడుల నేపథ్యంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జార్ఖండ్ లోని ఐదు జిల్లాల ప్రజలకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పాలి. కనిపించిన వారిపై దాడి చేస్తూ దారుణంగా ప్రాణాలు  తీసేస్తూ ఉన్నాయి. దీంతో ఎప్పుడు ప్రాణాలకు పోతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు.



 ఇలా జార్ఖండ్ లోని ఐదు జిల్లాల పరిధిలో గత 12 రోజుల్లోనే వరుసగా దాడులకు పాల్పడిన ఏనుగులు ఏకంగా 16 మందిని పొట్టను పెట్టుకున్నాయి అన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అయితే కేవలం ఒక్క రాంచి జిల్లాలోనే ఏనుగులు నలుగురి ప్రాణాలు తీశాయని అటవీ అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల కాలంలో ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సం నేపథ్యంలో ఇట్కీ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు పోలీసులు. ఝార్ఖండ్ లోని హజారీబాగ్, రాంఘడ్, చత్ర, లోహర్ దగ్గ, రాంచి జిల్లాలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏనుగులు దాడికి పాల్పడుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వరకు ఏనుగుల దాడిలో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారూ అని చెప్పాలి. ఇక ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు అని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం ఏకంగా ఏనుగులకు అతి సమీపంలోకి వెళ్తున్నారని చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. ఇలాంటివి చేయవద్దు అంటూ సూచించారు.



RRR Telugu Movie Review Rating

అతన్ని కూడా వదిలేసిన సమంత.. అదే కారణమా..!?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>