Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kl-rahuleb518939-3d07-4a21-ac8b-10eaac828b5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kl-rahuleb518939-3d07-4a21-ac8b-10eaac828b5b-415x250-IndiaHerald.jpgటీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అతనికి బీసీసీఐ వరుసగా అవకాశాలు ఇవ్వడం పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఇటీవలే మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ పై ఘాటుగానే విమర్శలు చేశాడు. కేఎల్ రాహుల్ ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో తాను కూడా ఒక్కడిని అని చెబుతూనే ఇక మరోవైపు అతని జట్టు నుంచి పీకి పారేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్న విధంగా మాట్లాడాడు. అయితేKl rahul{#}Akash Chopra;akash;prasad;venkatesh prasad;you tube;rahul;Rahul Sipligunj;INTERNATIONAL;Venkatesh;K L Rahul;media;BCCIకేఎల్ రాహుల్ కోసం.. ఇద్దరు మాజీ క్రికెటర్లు డిష్యుం డిష్యూం?కేఎల్ రాహుల్ కోసం.. ఇద్దరు మాజీ క్రికెటర్లు డిష్యుం డిష్యూం?Kl rahul{#}Akash Chopra;akash;prasad;venkatesh prasad;you tube;rahul;Rahul Sipligunj;INTERNATIONAL;Venkatesh;K L Rahul;media;BCCIWed, 22 Feb 2023 14:30:00 GMTటీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అతనికి బీసీసీఐ వరుసగా అవకాశాలు ఇవ్వడం పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఇటీవలే మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ పై ఘాటుగానే విమర్శలు చేశాడు. కేఎల్ రాహుల్ ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో తాను కూడా ఒక్కడిని అని చెబుతూనే ఇక మరోవైపు అతని జట్టు నుంచి పీకి పారేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్న విధంగా మాట్లాడాడు.


 అయితే వెంకటేశ్ ప్రసాద్ గత కొన్ని రోజులుగా అటు కేఎల్ రాహుల్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉండడం నేపథ్యంలో.. వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా కొనసాగుతున్నాయి అంటూ కొంతమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. వ్యక్తిగత ఎజెండాతోనే వెంకటేష్ ప్రసాద్ కెఎల్ రాకుండా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడని మరి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే మరోసారి వెంకటేష్ ప్రసాద్ కేఎల్ రాహుల్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆకాష్ చోప్రా సైతం వాడి వేడి చర్చకు దిగాడు. సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ ప్రసాద్ కి కౌంటర్ వేశాడు ఆకాశ చోప్రా.



 తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించిన ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... వెంకటేష్ ప్రసాద్కు అనుకూలంగా ఉండేలా మయాంక్, ధావన్, గిల్ గణాంకాలను చూపెట్టాడు అంటూ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. కేల్ రాహుల్ తో తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని ఆకాష్ చోప్రా చెప్పాడు. దీనిపైన స్పందించిన వెంకటేశ్ ప్రసాద్..  అదంతా అవాస్తవం. నాకు ఏ ఆటగాడితో గొడవ లేదు. అన్యాయమైన సెలక్షన్ కి నేను వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే 2014లో రోహిత్ పై ఆకాష్ చోప్రా పెట్టిన పోస్ట్ ను తెరమీదకి తెచ్చాడు వెంకటేష్ ప్రసాద్. 24 ఏళ్ల వయసు నాలుగేళ్ల అనుభవం ఉన్నప్పుడు అతనిపై ఆకాష్  వ్యంగ్యంగా సెటైర్ వేస్తే.. ఇప్పుడు 8 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడకపోతే  విమర్శలు చేయకూడదా ఇది సరైనదేనా అంటూ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు. ఇలా కేఎల్ రాహుల్ కోసం ఇద్దరు మాజీ క్రికెటర్లు కూడా గొడవ పడుతున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ సింహాద్రిని మిస్ చేసుకున్న స్టార్స్?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>