MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaec9865b-cf34-4226-be5f-a62a47e2fed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaec9865b-cf34-4226-be5f-a62a47e2fed2-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో యువతరాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న మంగళూరు సోయగం కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది ఈమె. ఈ ఒక్క సినిమాతో తనకంటూ స్టార్ హీరోయిన్గా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా అనంతరం అప్పట్లో వరుస సినిమాలు చేసింది కృతి శెట్టి. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమె వరుసు సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ లో ఈమె ప్రయాణం అంత tollywood{#}Mangalore;News;sriram;Tollywood;Heroine;media;Cinema;Populationఆ యంగ్ హీరోతో జోడి కడుతున్న కృతి శెట్టి..!?ఆ యంగ్ హీరోతో జోడి కడుతున్న కృతి శెట్టి..!?tollywood{#}Mangalore;News;sriram;Tollywood;Heroine;media;Cinema;PopulationWed, 22 Feb 2023 12:10:00 GMTఉప్పెన  సినిమాతో యువతరాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న మంగళూరు సోయగం కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది ఈమె. ఈ ఒక్క సినిమాతో తనకంటూ స్టార్ హీరోయిన్గా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా అనంతరం అప్పట్లో వరుస సినిమాలు చేసింది కృతి శెట్టి. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమె వరుసు సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ లో ఈమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇకపోతే ఉప్పెన హీరోయిన్ కి పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దింతో తన తర్వాతే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు కథల ఎంపికల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది అని తెలుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె శర్వానంద్ తో జోడి కట్టబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.

దీంతో మొదటిసారి వీరిద్దరూ జోడిగా కనిపించబోతున్నారని తెలిసిన వీరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే కృతి శెట్టి కూడా షూటింగ్లో పాల్గొనబోతోందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో కృతి శెట్టి కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ సింహాద్రిని మిస్ చేసుకున్న స్టార్స్?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>