MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-upsatee5ec79e5-058a-4767-96b4-d773e93a2c9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-upsatee5ec79e5-058a-4767-96b4-d773e93a2c9a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిమితమై.. ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా రేంజ్ లో చలామణి అవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు కూడా మహేష్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలో ఉండగా తాజాగా సర్కారు వారి పాట సినిమా తర్వాత ఆయన ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా తెరకెక్కిస్తున్నారుSSMB-28;UPSATE{#}Pooja Hegde;Allu Arjun;kajal aggarwal;mahesh babu;nithya menon;sree;trivikram srinivas;News;Success;Brahmotsavam;S/O Satyamurthy;Heroine;India;Cinema;HeroSSMB 28 మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..!SSMB 28 మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..!SSMB-28;UPSATE{#}Pooja Hegde;Allu Arjun;kajal aggarwal;mahesh babu;nithya menon;sree;trivikram srinivas;News;Success;Brahmotsavam;S/O Satyamurthy;Heroine;India;Cinema;HeroWed, 22 Feb 2023 07:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిమితమై.. ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా రేంజ్ లో చలామణి అవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు కూడా మహేష్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలో ఉండగా తాజాగా సర్కారు వారి పాట సినిమా తర్వాత ఆయన ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పూర్తి చేసి సినిమాను  విడుదల చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం..  ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే , శ్రీ లీల ను ఎంపికైన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ రావడం గమనార్హం.  ఇందులో మూడవ హీరోయిన్ గా భూమి పడ్నేకర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే ముగ్గురు హీరోయిన్లు అన్నట్టుగా మార్కు పడిపోయే విధంగా కనిపిస్తోంది.  ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా.. నిత్యామీనన్ , ఆదాశర్మ,  సమంతాలు హీరోయిన్లుగా నటించి మెప్పించారు.

ఆ తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో కూడా సమంత, కాజల్ , ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పూజ హెగ్డే,  శ్రీ లీల,  భూమి పడ్నేకర్ లను తీసుకోబోతున్నట్లు సమాచారం.  ఒకవేళ ఇదే నిజమైతే ఇక రాబోయే త్రివిక్రమ్ సినిమాలలో తప్పకుండా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తీసిన ఈ చిత్రాలలో సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదు అనిపించుకుంది. కానీ బ్రహ్మోత్సవం సినిమా బోల్తా కొట్టింది.  మరి ఈ సినిమా అయినా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సౌందర్య చనిపోవడానికి ఆ ఇల్లే కారణమా.. !?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>