AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/bajaj-pulser-220fe0cc84a8-fddd-4c56-9f70-56e9b55cfee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/bajaj-pulser-220fe0cc84a8-fddd-4c56-9f70-56e9b55cfee5-415x250-IndiaHerald.jpgసేల్స్ పరంగా ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో 'పల్సర్ 220ఎఫ్' రిలీజ్ చేసింది. పల్సర్ బైక్ కి ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఇది నెంబర్ వన్ బైక్ గా దూసుకుపోతుంది.ఈ అప్డేటెడ్ బైక్ ధర వచ్చేసి రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్) గా వుంది.బజాజ్ పల్సర్ తొలిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007 వ సంవత్సరంలో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది,. ఇక ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ ని నిలిపివేసింది, అయితే ఇపBAJAJ PULSER 220F{#}Good Newwz;Good news;oil;Red;Bike;Indianసూపర్ ఫీచర్లతో బజాజ్ పల్సర్ 220ఎఫ్ రిలీజ్?సూపర్ ఫీచర్లతో బజాజ్ పల్సర్ 220ఎఫ్ రిలీజ్?BAJAJ PULSER 220F{#}Good Newwz;Good news;oil;Red;Bike;IndianTue, 21 Feb 2023 15:44:36 GMTసేల్స్ పరంగా ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో 'పల్సర్ 220ఎఫ్' రిలీజ్ చేసింది. పల్సర్ బైక్ కి ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఇది నెంబర్ వన్ బైక్ గా దూసుకుపోతుంది.ఈ అప్డేటెడ్ బైక్ ధర వచ్చేసి రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్) గా వుంది.బజాజ్ పల్సర్ తొలిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007 వ సంవత్సరంలో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది,. ఇక ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ ని నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ ని రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ తీసుకోవడం కూడా ప్రారంభించింది. దీని డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్ ఇంకా రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ లో విడుదల చేసింది.


కంపెనీ తన బైకులను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది.ఇక బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్‌పి పవర్ ఇంకా 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఇంకా సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. ఇంకా అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ ని కూడా కలిగి ఉంది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా పాత మోడల్ లాగానే అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్ ఇంకా అలాగే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది.ఇది నిజంగా పల్సర్ లవర్లకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>