Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajala64c550b-3b83-42e4-9acb-1cdb30d25972-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajala64c550b-3b83-42e4-9acb-1cdb30d25972-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాలీవుడ్ చందమామగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో మొదటి హిట్ సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా తర్వాత కాజల్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది అని చెప్పాలి. ఎవరి పక్కన నటించిన కూడా ఆ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అని పేరు సంపాదించుకుంది. అయితే కెరియర్ ఆరంభం నుంచి తన గ్లామర్ ని నమKajal{#}teja;Lakshmi Kalyanam;anil ravipudi;Audience;kajal aggarwal;Heroine;Tollywood;Yuva;Cinemaఇప్పటికీ.. అలాంటి సినిమాలకు నో చెబుతున్న కాజల్?ఇప్పటికీ.. అలాంటి సినిమాలకు నో చెబుతున్న కాజల్?Kajal{#}teja;Lakshmi Kalyanam;anil ravipudi;Audience;kajal aggarwal;Heroine;Tollywood;Yuva;CinemaTue, 21 Feb 2023 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాలీవుడ్ చందమామగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో మొదటి హిట్ సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా తర్వాత కాజల్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది అని చెప్పాలి.


 ఎవరి పక్కన నటించిన కూడా ఆ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అని పేరు సంపాదించుకుంది. అయితే కెరియర్ ఆరంభం నుంచి తన గ్లామర్ ని నమ్ముకున్న ఈ ముద్దుగుమ్మా ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసేందుకు రిస్క్ చేయలేదు. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా నో చెబుతూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే కాజల్ అగర్వాల్తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్లు ఇక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటే... ఇప్పటికీ కాజల్ అగర్వాల్ అలాంటి సినిమాల జోలికి వెళ్లడం లేదు. ఇకపోతే కాజల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది అని చెప్పాలి.


 దీంతో కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే  కొత్త సినిమాతో మళ్లీ రి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలోనే మరోసారి కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమాకు నో చెప్పేసిందట. ఒక యువ దర్శకుడు ఆమెకు ఒక మంచి లేడీ ఓరియంటెడ్ కథను వినిపించాడట. అయితే కనీసం కథ వినేందుకు కూడా అటు ఆమె ఆసక్తి చూపలేదట. కేవలం కమర్షియల్ సినిమాలలో హీరోల పక్కన నటించాలని మాత్రమే కాజల్ భావిస్తుందట. ఇంకోన్నాళ్లపాటు హీరోయిన్గా హవా నడిపించి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల జోలికి పోవాలని భావిస్తుందట ఈ టాలీవుడ్ చందమామ.



RRR Telugu Movie Review Rating

అవినాష్ కాళ్లు పట్టుకున్న సదా.. ఎందుకో తెలుసా?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>