Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dkc8116cba-485b-4fa3-8318-d0255e75f5be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dkc8116cba-485b-4fa3-8318-d0255e75f5be-415x250-IndiaHerald.jpgదినేష్ కార్తీక్.. ఈ పేరు భారత క్రికెట్లో సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి సీనియర్ క్రికెటర్ అనే ముద్ర వేసుకొని ఇక జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడు.. మళ్ళీ జట్టులోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే నేటి రోజుల్లో ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ ఇక జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటిది అప్పటికే అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకున్న దినేష్ కార్తీక్ టీమిండియా తరఫున ఒకసారి కూడా నిరూపించుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో రాణిస్తున్న అతని సెలెక్టర్లు పట్టించుకోలేదు. దీంతో దినేష్ కార్తీక్ కDk{#}World Cup;Karthik;Yuva;Australia;Cricketదినేష్ కార్తీక్ ఆన్ ఫైర్.. 38 బంతుల్లో 75 రన్స్?దినేష్ కార్తీక్ ఆన్ ఫైర్.. 38 బంతుల్లో 75 రన్స్?Dk{#}World Cup;Karthik;Yuva;Australia;CricketTue, 21 Feb 2023 19:52:15 GMTదినేష్ కార్తీక్.. ఈ పేరు భారత క్రికెట్లో సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే  ఒక్కసారి సీనియర్ క్రికెటర్ అనే ముద్ర వేసుకొని ఇక జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడు.. మళ్ళీ జట్టులోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే నేటి రోజుల్లో ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ ఇక జట్టులో  అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటిది అప్పటికే అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకున్న దినేష్ కార్తీక్ టీమిండియా తరఫున ఒకసారి కూడా నిరూపించుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో రాణిస్తున్న అతని సెలెక్టర్లు పట్టించుకోలేదు.


 దీంతో దినేష్ కార్తీక్ కెరియర్ ముగిసిపోయిందని.. ఇక టీమ్ ఇండియాలో చోటు దక్కుతుంది అని ఆశలు పెట్టుకోవడం అతను మానుకోవాలి అంటూ ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే 2022 ఐపీఎల్ సీజన్లో అతని ప్రదర్శన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ముఖ్యంగా మెరుపు ఇన్నింగ్స్ లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించిన తీరు క్రికెట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దినేష్ కార్తీక్ లో ఇలాంటి పవర్ హిట్టర్ కూడా ఉన్నాడా అని అందరిని ఆలోచనలో పడిపోయేలా చేసింది.


 ఈ క్రమంలోనే తన పవర్ హిట్టింగ్ తో సెలెక్టర్ల చూపును ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఏకంగా గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. కానీ అప్పటివరకు బ్యాటింగ్ లో దంచి కొట్టిన దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో సెలెక్టర్లు వెంటనే అతని పక్కన పెట్టేశారు. అయితే వరల్డ్ కప్ లో నిరాశ పరిచిన దినేష్ కార్తీక్ మళ్ళీ ఐపీఎల్ మోడ్ లోకి వచ్చేసాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో 75 పరుగులు సాధించాడు. ఇక అతని బ్యాటింగ్ కారణంగానే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న  జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. డివై పాటిల్ టి20 కప్ 2023 సూపర్ లీగ్ లో భాగంగా డివై పార్టీలు గ్రూప్ బి టీం.. ఆర్.బి.ఐ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు దినేష్ కార్తీక్.



RRR Telugu Movie Review Rating

మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>