MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaushal184c0e0e-34d2-4cd5-af47-b13cc703edb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaushal184c0e0e-34d2-4cd5-af47-b13cc703edb9-415x250-IndiaHerald.jpgఇక బిగ్ బాస్ కంటెస్టంట్‌తో స్టార్‌ మా ఛానల్ బీబీ జోడి అనే ఓ కొత్త డాన్స్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ జోడిగా ఈ షోలో పెర్పామెన్స్‌ ఇస్తున్నారు.ఇందులో సహా కంటెస్టెంట్స్‌ కూడా జోడిగా ఉండి మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్‌ హౌజ్‌లో లాగానే స్కోర్స్‌ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్‌ కూడా అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్‌ అయిన తరుణ్‌ మాస్టర్‌, సదా ఇంకా నటి రాధపై అసహనం వ్యKAUSHAL{#}bhanu;Pink;Nijam;Bigboss;Sada;Tollywoodబీబీ జోడి జడ్జెస్ పై కౌశల్ షాకింగ్ కామెంట్స్?బీబీ జోడి జడ్జెస్ పై కౌశల్ షాకింగ్ కామెంట్స్?KAUSHAL{#}bhanu;Pink;Nijam;Bigboss;Sada;TollywoodTue, 21 Feb 2023 14:51:23 GMTఇక బిగ్ బాస్ కంటెస్టంట్‌తో స్టార్‌ మా ఛానల్ బీబీ జోడి అనే ఓ కొత్త డాన్స్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ జోడిగా ఈ షోలో పెర్పామెన్స్‌ ఇస్తున్నారు.ఇందులో సహా కంటెస్టెంట్స్‌ కూడా జోడిగా ఉండి మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్‌ హౌజ్‌లో  లాగానే స్కోర్స్‌ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్‌ కూడా అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్‌ అయిన తరుణ్‌ మాస్టర్‌, సదా ఇంకా నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్‌ విన్నర్‌, ఇంకా టాలీవుడ్ నటుడు కౌశల్‌.ఇంకా ఈ షోలో పలువురు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ జోడి కట్టి తమ డాన్స్‌ పర్ఫామెన్స్‌తో ఎంతగానో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి కూడా ఒకటి. నిజం చెప్పాలంటే బిబి జోడి టైటిల్‌ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం నాడు జరిగిన ఎపిసోడ్‌లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్‌ అయిన వాసంతి-అర్జున్‌ కల్యాణ్‌ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను ఎంతగానో మెప్పించారు. వారి చేత  ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్‌ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ మంచి స్కోర్స్‌ ఇచ్చారు.అయితే ఇందులో రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు.


అయితే ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్‌ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని వారు సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి వారు 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్‌ అవ్వాలంటే వారికి ఈ ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్‌ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులని ఇచ్చారు. దాని ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్‌ అయ్యి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్‌ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరుని అతను తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో వివాదస్పద పోస్ట్‌ షేర్‌ చేశాడు. 'ఇక నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్‌లో పింక్ సీటు గెలుచుకున్న తీరు చాలా అద్భుతం.బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు మాత్రం లేదు. జడ్జస్‌ అనేవారు కేవలం కంటస్టెంట్స్‌ డాన్స్‌ మాత్రమే జడ్జ్‌ చేయాలి కానీ వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచినా కూడా అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్‌' అంటూ కౌశల్ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>