BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/adhaar linking prastutaaniki akkaraleadu-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/adhaar linking prastutaaniki akkaraleadu-415x250-IndiaHerald.jpgప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్లు ఇంకా అలాగే ఫోన్‌ సిమ్‌కార్డులు.. ఒక్కటేంటి ఏ పని చేయాలన్నీ కూడా ఇప్పుడు ఆధార్‌ అనేది చాలా తప్పనిసరైంది. అప్పుడే పుట్టిన పసికందు నుంచి పండు ముసలి దాకా ప్రతి భారత పౌరులందరికీ యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేస్తోంది.ఇక అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డుని జారీ చేస్తోంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేకపోవడంతో వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్‌ కార్డుతో లింక్ చేAADHAAR CARD{#}UIDAI;central government;Application;Februaryయూఐడీఏఐ న్యూ రూల్స్: ఆధార్ కార్డు పొందాలంటే?యూఐడీఏఐ న్యూ రూల్స్: ఆధార్ కార్డు పొందాలంటే?AADHAAR CARD{#}UIDAI;central government;Application;FebruaryMon, 20 Feb 2023 17:35:51 GMTప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్లు ఇంకా అలాగే ఫోన్‌ సిమ్‌కార్డులు.. ఒక్కటేంటి ఏ పని చేయాలన్నీ కూడా ఇప్పుడు ఆధార్‌ అనేది చాలా తప్పనిసరైంది. అప్పుడే పుట్టిన పసికందు నుంచి పండు ముసలి దాకా ప్రతి భారత పౌరులందరికీ యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేస్తోంది.ఇక అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డుని జారీ చేస్తోంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేకపోవడంతో వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్‌ కార్డుతో లింక్ చేస్తున్నారు. 5 ఏళ్ళు పూర్తైన తర్వాత చిన్నారుల ప్రత్యేకంగా బయోమెట్రిక్‌ తీసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.ఇలా పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఆధార్‌ నంబర్‌ కేటాయించేందుకు యూఐడీఏఐ తాజాగా కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ యూఐడీఏఐ కీలక నిర్ణయంని తీసుకోవడం జరిగింది.ఇక తల్లిదండ్రుల ఇద్దరి యొక్క ఆధార్‌ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం కూడా తెలియజేయాల్సి ఉంటుంది.


ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ ఆదేశాలు పలు జారీ చేశారు.ఇక తాజా నిబంధనల్లో భాగంగా.. 5 సంవత్సరాల లోపు వారు ఆధార్ తీసుకునేందుకు వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తు ఫారంలో పూరించవల్సి ఉంటుంది. ఇంకా అలాగే 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి ప్రత్యేక దరఖాస్తు ఫారం ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది.ఇక 18 సంవత్సరాలు నిండిన వారికి మరో దరఖాస్తు ఫారం.. ఈ రకంగా మొత్తం మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను uidai రిలీజ్ చేసింది. వీటిని అన్నీ భాషల్లో ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా యూఐడీఏఐ(UIDAI) తెలిపింది.ఇక నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలన్నా లేదా వాళ్ల ఆధార్ లో ఏమైనా తప్పులను కరెక్షన్ చేయాలన్నా కూడా తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు ఉండాల్సిందే.



RRR Telugu Movie Review Rating

హెబ్బా పటేల్ గ్లామర్ మెరుపులు.. ఫోటోస్ వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>