BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/daughterd365780d-ae23-4af3-bac3-372fc613dd1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/daughterd365780d-ae23-4af3-bac3-372fc613dd1a-415x250-IndiaHerald.jpgఇక మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి మంచి పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అలా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. 2015 వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకంలో కేవలం 48 గంటల్లోనే ఏకంగా 10 లక్షల మంది ఖాతాలు తెరిచారు.ఇంత మంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పోస్టల్ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇక ఆడ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ స్కీం కింద, తన కుమార్తె కోసం ఖాతా కనుక తెరిస్తే.. ఆమె విద్య నుంచి పెళ్లి దాకా అన్ని ఖDAUGHTER{#}Sukanya;Indian Postal Service;vidya;Narendra Modi;Prime Minister;Girl;Bank;Government;central government;marriage;Fatherమీ కూతురికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలంటే?మీ కూతురికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలంటే?DAUGHTER{#}Sukanya;Indian Postal Service;vidya;Narendra Modi;Prime Minister;Girl;Bank;Government;central government;marriage;FatherMon, 20 Feb 2023 20:24:19 GMTఇక మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి మంచి పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అలా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. 2015 వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకంలో కేవలం 48 గంటల్లోనే ఏకంగా 10 లక్షల మంది ఖాతాలు తెరిచారు.ఇంత మంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పోస్టల్ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇక ఆడ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ స్కీం కింద, తన కుమార్తె కోసం ఖాతా కనుక తెరిస్తే.. ఆమె విద్య నుంచి పెళ్లి దాకా అన్ని ఖర్చులను కూడా తండ్రి సమకూర్చవచ్చు.‘బేటీ బచావో బేటీ పఢావో’ మిషన్ కింద మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీం చిన్న పొదుపు పధకాల కిందకు వస్తుంది. ఈ స్కీంలో ఆడపిల్లల పేరు మీద 15 సంవత్సరాల పాటు ఖాతా తెరవచ్చు.ఇంకా అలాగే ఈ పధకంలో పొదుపు చేసే మొత్తానికి ప్రభుత్వం చాలా ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అందుకే ప్రజలు ఈ పథకంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.


ఇంకా అలాగే బడ్జెట్ 2023 తర్వాత, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసే క్రమంలో పోస్టల్ శాఖ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని వల్ల కేవలం 48 గంటల్లోనే ఏకంగా 10 లక్షల మంది సుకన్య సమృద్ది యోజన ఖాతాలు తెరవడం జరిగింది.ఇంకా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి పోస్టాఫీస్‌ అత్యధిక వడ్డీ రేటు వచ్చేసి మొత్తం 7.60 శాతం చెల్లిస్తుంది. మీరు ఈ ఖాతాను మీకు దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు.అయితే ఈ ఖాతాలో కనీసం 250 రూపాయలు మీరు డిపాజిట్ చెయ్యాలి. ఒక నెల లేదా సంవత్సరంలో మీరు ఎన్ని సార్లయినా ఇందులో డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే ఇందులో డిపాజిట్ చేయ్యాలి. మీ కుటుంబంలో ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవగలరు. గరిష్టంగా అయితే ఇందులో ఇద్దరు ఆడపిల్లల ఖాతాలు తెరవవచ్చు. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.అయితే ఆదాయపు పన్ను సెక్షన్ 80 సి కింద ఈ పధకానికి పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.



RRR Telugu Movie Review Rating

హెబ్బా పటేల్ గ్లామర్ మెరుపులు.. ఫోటోస్ వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>