Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh2895722a6c-63eb-428b-9820-4d5da43fa2b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh2895722a6c-63eb-428b-9820-4d5da43fa2b3-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ మూవీ ఒకటి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే సినిమాకు కావాల్సిన భారీ హంగులను జత చేర్చుతున్నారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్Mahesh28{#}anoushka;trivikram srinivas;Bhagamathi;Jabardasth;Pooja Hegde;Rajamouli;Heroine;bollywood;Remake;Telugu;India;Cinemaమహేష్ 28.. మరో అందాల భామని దించుతున్నారా..?మహేష్ 28.. మరో అందాల భామని దించుతున్నారా..?Mahesh28{#}anoushka;trivikram srinivas;Bhagamathi;Jabardasth;Pooja Hegde;Rajamouli;Heroine;bollywood;Remake;Telugu;India;CinemaMon, 20 Feb 2023 13:52:00 GMTసూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ మూవీ ఒకటి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే సినిమాకు కావాల్సిన భారీ హంగులను జత చేర్చుతున్నారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. మహేష్ 28వ సినిమా గురించి రోజుకొక అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఇక ఇప్పటికే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని తెలుస్తుండగా లేటెస్ట్ గా మహేష్ 28వ సినిమా లో మూడవ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. పూజా హెగ్దే, శ్రీలీల ఇద్దరు హీరోయిన్స్ మహేష్ సినిమా లో హీరోయిన్స్ గా ఉండగా.. లేటెస్ట్ గా మూడవ హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ని కూడా తీసుకున్నట్టు టాక్. భూమి పడ్నేకర్ హిందీలో వరుస క్రేజీ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తెలుగులో అనుష్క నటించి హిట్టైన భాగమతి సినిమాను హిందీలో రీమేక్ చేసింది భూమి పడ్నేకర్.

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కి సౌత్ సినిమాలంటే ఎక్కువ మక్కువ ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమాల మీద అక్కడ భామలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే భూమి కూడా మహేష్ 28వ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో ఆమె సెకండ్ హాఫ్ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని టాక్. అంతేకాదు భూమి ఈ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరి మఏష్ 28 సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ మస్త్ జబర్దస్త్ ఎంటర్టైనింగ్ అందిస్తారని చెప్పొచ్చు. మహేష్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత జక్కన్నతో సినిమాకు రెడీ అవుతున్నారు. రాజమౌళి ఇప్పటికే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడని తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

వారసుడు కాంబో రిపీటు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>