Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujarac2747aad-3187-451e-9231-adac891de853-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujarac2747aad-3187-451e-9231-adac891de853-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత పర్యటనకు వచ్చి నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న పటిష్టమైన ఆస్ట్రేలియాపై అటు ఆతిథ్య భారత జట్టు ఆధిపత్యం చెలయిస్తుంది. భారత జట్టును వారి స్వదేశంలో ఓడించడం అసాధ్యం అని క్రికెట్ పండితులు చెప్పిన విషయాన్ని ఇక ఇప్పుడు నిజం అని నిరూపిస్తుంది భారత జట్టు. అయితే పటిష్టమైన ఆస్ట్రేలియా తో భారత్కు ఒక మంచి సవాల్ ఎదురు కాబోతుందని.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని ఎంతోమంది అంచనా వేసినప్పటికీ భారత జట్టు మాత్రం తమ ప్రదర్శనతో వార్ వన్ సైడ్ చేసేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమPujara{#}Arun;Australia;Arun Jaitley;Cricket;war;Nijam;Indiaనిజంగా.. ఇది నాకెంతో ప్రత్యేకం : పూజారానిజంగా.. ఇది నాకెంతో ప్రత్యేకం : పూజారాPujara{#}Arun;Australia;Arun Jaitley;Cricket;war;Nijam;IndiaMon, 20 Feb 2023 08:30:00 GMTప్రస్తుతం భారత పర్యటనకు వచ్చి నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న పటిష్టమైన ఆస్ట్రేలియాపై అటు ఆతిథ్య  భారత జట్టు ఆధిపత్యం చెలయిస్తుంది. భారత జట్టును వారి స్వదేశంలో ఓడించడం అసాధ్యం అని  క్రికెట్ పండితులు చెప్పిన విషయాన్ని ఇక ఇప్పుడు నిజం అని నిరూపిస్తుంది భారత జట్టు. అయితే పటిష్టమైన ఆస్ట్రేలియా తో భారత్కు ఒక మంచి సవాల్ ఎదురు కాబోతుందని.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని ఎంతోమంది అంచనా వేసినప్పటికీ భారత జట్టు మాత్రం తమ ప్రదర్శనతో వార్ వన్ సైడ్ చేసేస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుకు గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తూ దూసుకుపోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అటు భారత ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కొల్లగోడుతున్నారు. ఇకపోతే ఆస్ట్రేలియా తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అటు భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న పూజార ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.


 భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే పరిమితమైన 100వ టెస్ట్ మ్యాచ్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పూజార పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ అతనికి 100వ మ్యాచ్ అయిన టెస్టులో మాత్రం భారత్ విజయం సాధించింది. ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను ఆడిన 100 టెస్ట్ లో జట్టు విజయం సాధించడం నిజంగా నా కెరియర్ లో ఎంతో ప్రత్యేకం. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు చేయకపోయినా రెండో ఇన్నింగ్స్ లో విన్నింగ్ షాట్ కొట్టడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. మిగిలిన రెండు టెస్టులలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తా.. భారత్ బౌలర్లు అద్భుతంగా రానించి జట్టుకు విజయాన్ని అందించారు అంటూ పూజార చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఆ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో ' డార్లింగ్ ' తో చేయగలడా.....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>