EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warf84b714e-a61f-4c33-8c38-4d946758b8d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warf84b714e-a61f-4c33-8c38-4d946758b8d7-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్దం దాదాపు ఏడాది కావొస్తుంది. ఆ యుద్ధం ప్రస్తుతం భీకరంగా కొనసాగుతుంది. 2018 లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా కేవలం ఉక్రెయిన్ లో 18 శాతం భూభాగాన్నే ఆక్రమించింది. డొనెట్స్కీ, లూహాన్ స్కీ, జెపోజెజరియా, కేర్ సన్ లాంటి ప్రాంతాలను రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. లూహన్ స్కీ దగ్గర ప్రస్తుతం యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. నాటో దేశాలకు సంబంధించిన సైనికాధిపతి ఉక్రెయిన్ కు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయుధాల వాడకాన్ని రష్యా పెంచేసిందిUKRAIN WAR{#}Russia;Poland;Belarus;American Samoa;Fighter;war;Ukraineయుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?UKRAIN WAR{#}Russia;Poland;Belarus;American Samoa;Fighter;war;UkraineMon, 20 Feb 2023 23:00:00 GMTరష్యా ఉక్రెయిన్ యుద్దం దాదాపు ఏడాది కావొస్తుంది. ఆ యుద్ధం ప్రస్తుతం భీకరంగా కొనసాగుతుంది. 2018 లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా కేవలం ఉక్రెయిన్ లో 18 శాతం భూభాగాన్నే ఆక్రమించింది. డొనెట్స్కీ, లూహాన్ స్కీ, జెపోజెజరియా, కేర్ సన్ లాంటి ప్రాంతాలను రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.


లూహన్ స్కీ దగ్గర ప్రస్తుతం యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. నాటో దేశాలకు సంబంధించిన సైనికాధిపతి  ఉక్రెయిన్ కు  ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయుధాల వాడకాన్ని రష్యా పెంచేసింది. దాదాపు ప్రతి రోజు 20 వేల వరకు మిస్సైల్స్, బాంబు దాడులను చేస్తోందన్నారు. ఉక్రెయిన్, నాటో దేశాలు కలిపి కేవలం 6 వేల వరకు వాడుతున్నాం. అయినా మన వద్ద దాడి చేయడానికి ఆయుధాలు సరిపోవడం లేదని వాపోతున్నారు. ఆయుధాల తయారీలో కూడా వెనకబడి ఉన్నామని చెప్పారు. దీని వల్ల యుద్ధంలో అలసిపోయే పరిస్థితి ఎదురవుతోంది. శత్రువు బలంగా దాడి చేస్తుంటే చూస్తూ ఉండే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.


అమెరికా ఓ పక్కన ఆయుధాగారాలను నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని  చెబుతోంది. అయితే ఫైటర్ జెట్స్, మిస్సైల్స్, ఇతర ఆయుధాల ఉత్పత్తి పెంచేందుకు పని చేస్తున్నాం, ఇవన్నీ వచ్చేస్తే రష్యాను ఎదుర్కొవడం సులభమవుతుందని అమెరికా చెబుతోంది. ఆయుధాలు సమకూరితే రష్యా ఎయిర్ క్రాప్ట్ లను ఈజీగా నేలకూల్చవచ్చని భావిస్తోంది.


అయితే ఉక్రెయిన్ కు ఇక్కడ మరొక సమస్య ఎదురవుతోంది. బెలారస్ కూడా సైనిక పరంగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుంది. పోలాండ్ కు సమీపంలో బెలారస్ సైన్యానికి రష్యా సైన్యం శిక్షణ ఇస్తోంది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తయారైంది ఉక్రెయిన్ పరిస్థితి. ఇప్పటి వరకు రష్యాకు సహకరించిన దేశం ఏదీ లేదు. ఇప్పుడు బెలారస్ తోడుతో రష్యా యుద్ధంలో చెలరేగే అవకాశం ఉంది



RRR Telugu Movie Review Rating

హెబ్బా పటేల్ గ్లామర్ మెరుపులు.. ఫోటోస్ వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>